చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపం. ఆరడుగులకు పైగా ఎత్తు. ముఖ్యంగా యాక్షన్ హీరోకు కావలసిన అన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్న లియామ్ నీసన్ కు జేమ్స్ బాండ్ పాత్ర పోషించే అవకాశం వచ్చిందట!
పిన్నవయసులోనే కన్నుమూసిన హీరో తారకరత్న గురించి, ఇప్పుడు నందమూరి అభిమానులు విశేషంగా చర్చించుకుంటున్నారు. నిజానికి తారకరత్న కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ లేకపోయినప్పటికీ, నందమూరి ఫ్యాన్స్ కు ఆయనంటే అంత అభిమానం!
ఒకప్పుడు నాజూకు షోకులతో కుర్రకారును కిర్రెక్కించిన ఇలియానా డి'క్రుజ్ ఇప్పుడు ముద్దుగా బొద్దుగా తయారయింది. తెలుగు సినిమాలతోనే ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఉత్తరాదికి ఉరకలు వేసి, దక్షిణాదిపై - ముఖ్యంగా తనకు స్టార్ డమ్ సంపాదించి పెట్టిన టాలీవుడ్ పై కామెంట్స్ చేసింది.
Teja: దాదాపు ఇరవై మూడేళ్ళ క్రితం ఓ సినిమాటోగ్రాఫర్ కెమెరా వ్యూఫైండర్ లో నుండి అదే పనిగా చూడటం మానేసి, మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యారు. చిత్రంగా తొలి సినిమాకే 'చిత్రం' అని పేరు పెట్టారు. ఆ మూవీ సైతం 'చిత్రం'గానే ఘనవిజయం సాధించింది. ఒక్కసారిగా సినీజనం అందరి కళ్ళు అటువైపు చూశాయి.
Shahrukh Khan:దాదాపు తొమ్మిదేళ్ళ తరువాత 'పఠాన్'తో తనకు ఓ సాలిడ్ హిట్ రావడంతో షారుఖ్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నారు. 'పఠాన్' సినిమా వేయి కోట్లు పోగేసే దిశగా సాగుతోంది. షారుఖ్ ను ఆకాశానికి ఎత్తేస్తూ 'కింగ్ ఈజ్ బ్యాక్' అంటూ మీడియా కోడై కూస్తోంది. ఇది షారుఖ్ విజయమే కాదని, బాలీవుడ్ కు కూడా బిగ్ సక్సెస్ అని అంటున్నారు హిందీ బాబులు.
All Quiet:'బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్' (బి.ఎఫ్.టి.ఎఫ్.ఏ) అవార్డులకు 'బ్రిటన్ ఆస్కార్స్' అనే పేరుంది. ఇక్కడ విజేతలుగా నిలచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రభావం అమెరికాలో జరిగే 'అకాడమీ అవార్డులు' (ఆస్కార్ అవార్డ్స్)పై కూడా ఉంటుందని సినీ ఫ్యాన్స్ విశ్వసిస్తారు.
గత సంవత్సరం ఓ సర్వేలో ఆల్ ఇండియాలో టాప్ హీరోస్ ఎవరు అన్నదానిపై సర్వే సాగింది. అందులో తమిళ స్టార్ హీరో విజయ్ నంబర్ వన్ స్థానం ఆక్రమించుకోగా, రెండో స్థానంలో జూనియర్ యన్టీఆర్, మూడో స్థానంలో ప్రభాస్, నాలుగులో అల్లు అర్జున్ నిలిచారు.
ఆ నాటి 'డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియా' హేమామాలినికి మేచోమేన్ ధర్మేంద్రతో పెళ్ళయి 43 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ హేమామాలినిని కొందరు ఓ విషయంలో ప్రశ్నించడం మాత్రం మానలేదు.