'ఎస్' ఫర్ సక్సెస్ అంటారు. విశ్వనాథ్ కూడా ఆ సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. తన దగ్గరకు ఎవరైనా కొత్త నిర్మాతలు వస్తే, వారితో సినిమాలు తీసే టప్పుడు టైటిల్ లో 'ఎస్' అనే అక్షరంతో ఆరంభమయ్యేలా చూసేవారు.
తెలుగులో కళాతపస్విగా తనదైన బాణీ పలికించిన కె.విశ్వనాథ్ హిందీలోనూ తనదైన బాణీ పలికించారు. తన దర్శకత్వంలో తెలుగులో ఘనవిజయం సాధించిన 'సిరిసిరిమువ్వ' ఆధారంగా హిందీలో 'సర్గమ్' చిత్రాన్ని రూపొందించారాయన.
యాక్షన్ హీరోగా సాగుతున్న కృష్ణను నటునిగా తీర్చిదిద్దింది విశ్వనాథ్ అనే చెప్పాలి. అంతకు ముందు బాపు దర్శకత్వంలో కృష్ణ 'సాక్షి' వంటి సినిమాలో నటునిగా మార్కులు సంపాదించినా, కృష్ణను వైవిధ్యంగా చూపించింది విశ్వనాథే!
తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని ప్రతీతి. వారిద్దరూ నటించిన చిత్రాలకు అసోసియేట్ గా పనిచేస్తూనే తాను సినిమా కళను అధ్యయనం చేశానని కె.విశ్వనాథ్ పలు పర్యాయాలు చెప్పుకున్నారు. విజయా సంస్థ యన్టీఆర్ హీరోగా రూపొందించిన “పాతాళభైరవి, పెళ్లిచేసిచూడు, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు” వంటి చిత్రాలకు కె.విశ్వనాథ్ సౌండ్ విభాగంలో పనిచేశారు. ఇక అన్నపూర్ణ సంస్థలో ఏయన్నార్ నటించిన “తోడికోడళ్ళు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి” చిత్రాలకు ఆదుర్తి దర్శకత్వంలో అక్కినేని నటించిన “మంచి మనసులు, […]
“కళ కళ కోసం కాదు… ప్రజాశ్రేయస్సు కోసం…” అన్నారు పెద్దలు. దానికి అనుగుణంగా సాగిన కళాకారులు నిస్సందేహంగా ‘కళ’కోసం తపించిన వారే అని చెప్పాలి. విఖ్యాత దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ అలా ‘కళ కోసం తపించారు’ అందుకే జనం మదిలో ‘కళాతపస్వి’గా నిలిచారు. ఇంతకూ ఆయన తపన ఎలా సాగింది? తొలి నుంచీ తెలుగు చిత్రాలు సంగీతసాహిత్యాలతో సాగుతూ ఉన్నవే! ఇప్పటికీ మన తెలుగు సినిమాలు ‘మ్యూజికల్స్’గానే వస్తున్నాయి. ఆ రోజుల్లో అయితే సంగీతసాహిత్యాలకు మరీ పెద్ద […]
కాశీనాథుని విశ్వనాథ్ ఈ లోకంలో కన్నుతెరచింది 1930 ఫిబ్రవరి 19 న . తన బి.యస్సీ పట్టా పుచ్చుకోగానే చిత్రసీమపై ఆసక్తితో ఆయన విజయావాహినీ స్టూడియోస్ లో అడుగు పెట్టిందీ 1950 ఫిబ్రవరిలోనే. విజయా సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు వి.శివరామ్ వద్ద సౌండ్ రికార్డింగ్ విభాగంలో పనిచేశారు. అక్కడ ఉండగానే దర్శకత్వంపై మనసు మల్లించారు. కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్ వంటి దిగ్దర్శకుల పనితీరును గమనిస్తూ వచ్చారు. తరువాత ఆదుర్తి సుబ్బారావు వద్ద 1956లో చేరిందీ […]
కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘’నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈరోజు ఆయన కన్నుమూసిన వార్త విన్న నేను షాక్ కు గురయ్యాను. ఆయన లాంటి డైరెక్టర్ కన్నుమూయటం నాకే కాదు తెలుగు సినీ పరిశ్రమకే తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి […]
చూడగానే ఆయన కన్నుల్లో కళాపిపాస గోచరిస్తుంది. నిలువెత్తు రూపంలో కళాతపన కనిపిస్తుంది. ఆయన అణువణువునా వేదం నాదంలా వినిపిస్తుంది. కళలంటే ఆయనకు పంచప్రాణాలు. లలితకళలతో తెరపై ఆయన చిత్రించిన కళాఖండాలు తెలుగువారికి మాత్రమే సొంతమయిన అద్భుతాలు. ఆయన చిత్రాల్లోని కళావైభవం నిత్యం తెలుగువారిని పరవశింప చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయన తెలుగువారికి వరంగా లభించిన కళాతపస్వి అన్నారు. ఆయనే తెలుగు సినిమాకు లభించిన ‘కళాభరణం’ కాశీనాథుని విశ్వనాథ్. కాశీనాథుని విశ్వనాథ్ 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా […]
PawanKalyan On Unstoppable:నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్'సీజన్ 2లోని 9వ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడమే పెద్ద విశేషంగా మారింది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు.
ఓ సూపర్ స్టార్ సినిమా టైటిల్, వర్ధమాన కథానాయకులతో తెరకెక్కిన చిత్రం పేరు ఒకేలా ఉంటే ఎవరికి లాభం? నిస్సందేహంగా టాప్ స్టార్ మూవీకి ఉన్న క్రేజ్, చిన్న తారల సినిమాకు ఉండదు. కానీ, 1991లో చిరంజీవి ‘స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్’ సినిమా విడుదలైన సమయంలోనే భానుచందర్ హీరోగా తెరకెక్కిన ‘స్టూవర్ట్ పురం దొంగలు’ అనే చిత్రం వెలుగు చూసింది. టైటిల్స్ ఒకేలా ఉండడంతో జనం కాస్త కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే! అయితే బాగున్న […]