డాక్టర్ విక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది బర్త్ 10000 బీసీ’. రానా ప్రతాప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీ వినాయక మారుతి క్రియేషన్స్, లక్ష ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రదీప్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జుడా సంధి సంగీతం అందిస్తున్నారు. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ థ్రిల్లర్ ను తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. […]
ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు నాగ్ అశ్విన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి విభిన్నమైన చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ అశ్విన్… మొదటి చిత్రంతోనే హిట్ అందుకుని తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ‘మహానటి’తో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డును అందుకున్నాడు. ఇటీవలే ‘జాతి రత్నాలు’తో నిర్మాతగా మారి […]
అందాల ‘నిధి’ అగర్వాల్ హాట్ ఫోటోషూట్ తో నెట్టింట్లో సెన్సేషనల్ గా మారింది. తాజా పిక్స్ లో బ్లాక్ డ్రెస్ ధరించిన నిధి లుక్ అదిరిపోయింది. థై హై స్లిట్ ఉన్న బ్లాక్ డ్రెస్ లో నిధి నెటిజన్లను స్టన్ చేస్తోంది. నిధి పోస్ట్ చేసిన ఈ లేటెస్ట్ హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలలో అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ నిధికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా […]
ఎన్టీయార్, రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ‘యమదొంగ’తో తెలుగువారి ముందుకు వచ్చిన మలయాళీ నటి మమతా మోహన్ దాస్ ఆ తర్వాత కూడా పలు చిత్రాలలో నటించింది. గత కొంతకాలంగా ఆమె మలయాళ, తమిళ సినిమాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే మమతా మోహన్ దాస్ నటించిన మలయాళ చిత్రం ‘లాల్ బాగ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల […]
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజుకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రదీప్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడట. అయితే ప్రదీప్ ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు. ఇటీవలే ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్న ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్’ ముగిసింది. ఆ తరువాత ప్రదీప్ ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’కు వ్యాఖ్యాతగా చేశాడు. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ‘డ్రామా జూనియర్స్ సీజన్ 5’ […]
సోనూ సూద్ అభిమానులందరికీ ఓ శుభవార్త. తాజాగా జరిపిన కోవిడ్ 19 పరీక్షలలో తనకు నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని సోనూ సూద్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. నిజానికి కొద్ది రోజుల ముందు సోనూసూద్ కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అనే రిపోర్ట్ రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న సోనూ అభిమానులు కోట్లాది మంది ఆవేదన చెందారు. కొందరైతే ‘దేవుడికి కూడా కరోనా వస్తుందా?’ అంటూ ఆందోళన వ్యక్తం […]
యంగ్ హీరో సందీప్ కిషన్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. తమిళంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో తెలుగులో ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ పేరుతో హాకీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రీమేక్ చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న హాకీ గ్రౌండ్‌ను కాపాడుకోవడానికి ఓ కోచ్ చేసే ప్రయత్నానికి నిషేధింపబడ్డ ఓ నేషనల్ […]
కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలోని చాలా థియేటర్లు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రాబోయే నెలల్లో విడుదల తేదీలను ప్రకటించిన భారీ బడ్జెట్ మూవీల నిర్మాతలు… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. బడా నిర్మాత సురేష్ బాబు కూడా తన హ్యాండ్ఓవర్‌లో ఉన్న థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే […]
కొవిడ్ -19 కారణంగా భారతి అనే అమ్మాయి ఊపిరితిత్తులు దాదాపు 85-90 శాతం దెబ్బతిన్నాయి. సోనూసూద్ ఆమెను నాగ్‌పూర్‌లోని వోక్‌హార్ట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్పిడి లేదా ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. ఇది హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమని తెలిసి వెంటనే సోను అపోలో ఆస్పత్రి డాక్టర్లతో సంప్రదింపులు జరిపాడు. ఇ.సి.ఎం.ఓ. శరీరానికి కృత్రిమంగా రక్తం పంపింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడిని తొలగించవచ్చు వారు సోనూసూద్ కు తెలిపారు. […]
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా భారతదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే కరోనా పై అవగాహన కల్పించడానికి, పేదలకు ఆర్ధిక సహాయం అందించడానికి కొంతమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న క్రమంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇటీవల ఢిల్లీలోని కొన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపడానికి సుష్మితా సేన్ ముందుకొచ్చారు. ఆసుపత్రుల్లో చాలామంది పేషంట్స్ ప్రాణాలు రిస్క్ లో ఉండడం బాధాకరంగా ఉందని […]