ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్ […]
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘లెవెన్త్ అవర్’తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ ‘ఆహా’లో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం కల్పించినప్పటికీ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. కాగా తమన్నా ‘ఆహా’ కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది. డిజిటల్ రంగంలో మొదటి వెబ్ సిరీస్ […]
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, యశ్ రాజ్ ఫిలిమ్స్ ఫస్ట్ కాంబినేషన్ లో దాదాపు 180 కోట్ల రూపాయలతో ఓ సూపర్ హీరో సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే ఇందులో హీరో అజయ్ దేవ్ గన్ కాదు, నూతన నటుడు ఆహాన్ పాండే! అజయ్ కేవలం విలన్ మాత్రమే. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్ళక ముందే ఇప్పుడు అజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. శివ్ రావెల్ దర్శకత్వంలో యశ్ […]
దక్షిణాదిన బిజీగా ఉన్న స్టార్ ఎవరంటే తప్పకుండా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ‘ముంబైకార్’ షూటింగ్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ఎన్నో స్క్రిప్ట్ లు విని ఉన్నాడు. వాటిలో కొన్నింటికి డేట్స్ కేటాయించవలసి ఉంది. ‘సైరా, ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు వారికి కూడా సన్నిహితుడయ్యాడు విజయ్ సేతుపతి. తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్న విజయ్ అందుకు అనుగుణంగా తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట. విజయ్ సేతుపతి […]
ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో భారీ హిట్ ను అందుకున్నాడు. మాస్ మహారాజ రవితేజ, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘క్రాక్’ కోవిడ్ సమయంలోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ కలెక్షన్లు రాబట్టింది. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేనికి నిర్మాతల నుంచి, హీరోల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ మలినేని, బాలయ్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి […]
కరోనాతో నటుడు, దర్శకుడు, నిర్మాత లలిత్ బెహల్ మృతి కోవిడ్ -19 సంబంధిత అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 71 ఏళ్ళు. గతవారం ఈ సీనియర్ నటుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. లలిత్ బెహల్ కుమారుడు, దర్శకుడు కను బెహల్ మాట్లాడుతూ ‘శుక్రవారం మధ్యాహ్నం ఆయన చనిపోయారు. గతంలో నుంచి గుండెకు సంబంధించిన అనారోగ్యం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనకు కరోనా సోకడంతో […]
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ నడిపేసింది. అయితే ఇది నిజంగా కాదు… సినిమా కోసం. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ బాలీవుడ్ సినిమాలో అర్జున్ కపూర్ తో కలసి నటిస్తోంది రకుల్. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే […]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు వారి నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణ గారికి శుభాభినందనలు తెలియజేశారు. ఈ మేరకు చిరంజీవి “మన తెలుగు తేజం శ్రీ ఎన్.వి రమణ గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యార్ధి దశ […]
(ఏప్రిల్ 24న కె.బాపయ్య బర్త్ డే) ‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ అనేది సినిమా వెలుగు చూసిన రోజుల నుంచీ ఉన్న నానుడి. అందువల్ల సినిమా దర్శకునికి ఎంతో క్రమశిక్షణ అవసరం అని పలువురు భావించేవారు. అలాంటివారు తాము దర్శకత్వం చేస్తున్న సమయంలో క్రమశిక్షణతో మెలగడగమే కాదు, కృషి, దీక్ష, పట్టుదలకు చిహ్నంగా ‘యూనిఫామ్’ కూడా ధరించేవారు. తెలుగునాట కొందరు దర్శకులు ఆ పంథాలో పయనించారు. ఎక్కువమంది దర్శకులు వైట్ అండ్ వైట్ వేసుకొనేవారు. కానీ, ‘ఖాకీ’ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘డార్లింగ్’ మూవీ విడుదలై నేటితో 11 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 2010 ఏప్రిల్ 24 విడుదలైన ‘డార్లింగ్’ ఈరోజుతో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎ కరుణకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. హీరో తన తండ్రి ఏర్పాటు చేసిన రీయూనియన్ పార్టీలో నందిని అనే తన చిన్ననాటి స్నేహితురాలిని కలవడానికి వెళ్తాడు. అయితే అక్కడ ఆమెను […]