‘బిగ్ బాస్4’ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయిన నేపథ్యంలో ‘బిగ్ బాస్ 5’ను అనుకున్న టైమ్ కే ఆరంభించాలని భావించారు నిర్వాహకులు. అయితే కరోనా సెకండ్ వేవ్ తో ఈ ఏడాది కూడా ఆలస్యంగానే మొదలవుతుందంటున్నారు. గత ఏడాది కరోనా, లాక్ డౌన్ వల్ల కొన్ని నెలలు ఆలస్యంగా మొదలైంది ‘బిగ్ బాస్4’. పోటీదారులను ఎంపిక చేసి వారిని మూడు వారాలపాటు క్వారంటైన్ చేసి మరీ ఆరంభించారు. ఇక ఈ ఏడాది జూన్ నెలాఖరు నుంచి ‘బిగ్ […]
నందమూరి తారకరాముడి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ వీడియో 50 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ భీమ్ ఇంట్రో వీడియోకు అదిరి పోయే రెస్పాన్స్ లభించింది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. ఈ ఇంట్రో వీడియో విడుదలై దాదాపు ఆరు నెలలైంది. 50 మిలియన్ వ్యూస్ మాత్రమే కాదు 1.3 మిలియన్ […]
(ఏప్రిల్ 23న దర్శకుడు నాగ్ అశ్విన్ బర్త్ డే)అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన […]
పగలే వెన్నెలలు కురిపించిన గానం – అవనినే పులకింపచేసిన గాత్రం – జలతరింగిణికి దీటైన గళం – ఒక్కమాటలో చెప్పాలంటే పంచభూతాలనే పరవశింపచేసే గాత్రం ఎస్. జానకి సొంతం. ఆమె పాటలోని మాధుర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఒక్కసారి జానకమ్మ పాటతో సాగితే, మళ్ళీ మళ్ళీ పయనించాలనిపిస్తుంది. ఆమె పాటను మననం చేసుకున్న ప్రతీసారి మధురం మన సొంతమవుతుంది. మనకు పరమానందం పంచిన జానకమ్మ పాటలో ఎంత మాధుర్యం ఉంటుందో, ఆమెలో అదే స్థాయి ఆత్మవిశ్వాసమూ ఉంది. అందువల్లే […]
ప్రముఖ దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ఏక్ మినీ కథ’. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. యూవీ కకాన్సెప్ట్స్ బ్యానర్, మాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ […]
బాల నటుడిగా, యువ హీరోగా, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్ గా నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. అయ్యప్ప మహత్యం, షిరిడీ సాయి, శ్రీ రాఘవేంద్ర స్వామి వంటి చిత్రాల్లో నటించిన కౌశిక్ బాబు బాల నటునిగా నంది పురస్కారం అందుకున్నారు. ప్రముఖ పాత్రికేయుడు శ్రీ విజయబాబు తనయుడే కౌశిక్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో దిల్ రాజు కల నెరవేరినట్లయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కోర్ట్ డ్రామా ‘వకీల్ సాబ్’కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ‘వకీల్ […]
ఇరవై యేళ్ళ క్రితం చిత్రసీమలోకి అడుగుపెట్టిన స్నేహకు ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు. తెలుగుతో పాటు దక్షిణాది చిత్రాలన్నింటిలోనూ నటించేస్తోంది. నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న స్నేహకు ఇద్దరు సంతానం. ఓ గృహిణిగా కుటుంబ బాధ్యతలను చక్కగా నెరవేర్చుతూనే సినిమాల్లోనూ గౌరవప్రదమైన పాత్రలను పోషిస్తోంది. మొన్నటి వరకూ నాయికగా నటించిన స్నేహ ఇప్పుడు అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అయిపోయింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్ర సరసన నటించిన స్నేహ… ప్రస్తుతం తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో ఎక్కువగా […]
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. టాలీవుడ్ స్టార్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే చరణ్ వ్యానిటీ డ్రైవర్ జయరాంకు కరోనా సోకగా… ఈరోజు ఆయన కరోనాతో మృతి చెందాడు. చరణ్ సిబ్బందిలో ఒకరు కరోనాతో ఆకస్మికంగా చనిపోవడం విషాదకరం. ప్రస్తుతం చరణ్ కూడా ముందుజాగ్రత్తగా ఐసోలేషన్ లోకి వెళ్లారట. త్వరలోనే చరణ్ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోనున్నారు. […]
‘క్షణం, గూఢచారి, ఎవరు’ వంటి డిఫరెంట్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న అడివి శేష్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం మేజర్. శశి కిరణ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది. 26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు […]