అందాల ‘నిధి’ అగర్వాల్ హాట్ ఫోటోషూట్ తో నెట్టింట్లో సెన్సేషనల్ గా మారింది. తాజా పిక్స్ లో బ్లాక్ డ్రెస్ ధరించిన నిధి లుక్ అదిరిపోయింది. థై హై స్లిట్ ఉన్న బ్లాక్ డ్రెస్ లో నిధి నెటిజన్లను స్టన్ చేస్తోంది. నిధి పోస్ట్ చేసిన ఈ లేటెస్ట్ హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలలో అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ నిధికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. ‘సవ్యసాచి’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’, రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాల్లో నటించింది. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమె కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అశోక్ గల్లా సరసన హీరోయిన్ గా నటిస్తోంది నిధి. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’లో కూడా కనిపించనుంది.