(మే 1న దర్శకుడు సి.ఎస్.రావు జయంతి)మేటి దర్శకుల తనయులు సైతం తండ్రుల బాటలో పయనించి జయకేతనం ఎగురవేయడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. తెలుగు సినిమా రంగంలో పలు మరపురాని చిత్రాలు అందించిన సి.పుల్లయ్య తనయుడు సి.ఎస్.రావు అలాంటి అరుదైన వారిలో ఒకరు! ఆయన పూర్తి పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు. సి.ఎస్.రావు తండ్రి బాటలో పయనించి, దర్శకత్వంలో తనదైన బాణీ పలికించారు. తండ్రిలాగే దర్శకునిగా విజయపథంలో పయనించారు. తండ్రి, కొడుకు ఇద్దరూ కలసి రూపొందించిన ‘లవకుశ’ రంగుల […]
(మే 1న ‘ఎర్రమల్లెలు’కు 40 ఏళ్లు)తొలి నుంచీ అభ్యుదయ భావాలు కలిగి, వామపక్ష ఆదర్శాల నీడన మసలారు నటుడు, నిర్మాత, దర్శకుడు మాదాల రంగారావు. ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో తెరపై కనిపించిన మాదాల రంగారావు తరువాత మిత్రులతో కలసి నవతరం పిక్చర్స్ నెలకొల్పారు. ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు టి.కృష్ణ వంటివారు ఈ ‘నవతరం’ నీడలో నిలచిన వారే. తొలి ప్రయత్నంగా మాదాల రంగారావు నిర్మించి, నటించిన ‘యువతరం కదిలింది’ చిత్రం మంచి విజయం […]
చలో, భీష్మ చిత్రాలతో రెండు బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు యువ దర్శకుడు వెంకి కుడుముల. భీష్మ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంతకుముందు ఈ డైరెక్టర్ రామ్ చరణ్, మహేష్ బాబులతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈసారి స్టార్ హీరోతో పని చేయాలని భావిస్తున్నాడట వెంకీ. ప్రస్తుతం అతను ఒక హీరోని కనుగొనటానికి […]
శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బాయ్స్’. మిత్రా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గీతానంద్, మిత్రా శర్మ, రోనిత్ జిఆర్జి, అన్షులా ధావన్, శ్రీహాన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, శీతల్ తివారీ, సుజిత్, బమ్‌చిక్ బబ్లూ, కౌషల్ మండా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు […]
గర్భవతి అయిన ఓ మహిళ. జీవితం పట్ల బాధ్యత లేని ఓ కుర్రాడు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దాని పర్యవసానమే ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ ఇటీవల తెలుగులో బాగానే వస్తున్నాయి. వాటికి చక్కని ఆదరణ కూడా లభిస్తోంది. రొటీన్ ఫార్ములాకు భిన్నమైన సినిమా ఇదని 1.27 నిమిషాల ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, పెర్ఫార్మెన్స్ […]
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘ఎ 1 ఎక్స్ ప్రెస్’. డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్లే. తమిళంలో విజయవంతమైన ‘నట్పే తునై’ చిత్రానికి రీమేక్ ఇది. అయితే మార్చి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా మే […]
కోలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ఆర్‌ఎస్‌జి చెల్లాదురై ఏప్రిల్ 29 సాయంత్రం చెన్నైలోని పెరియార్ నగర్‌లోని తన నివాసంలో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగాయి. చెల్లాదురై తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ నటుల్లో ఒకరు. గురువారం ఆయన తన నివాసంలోని బాత్రూంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 84 ఏళ్ల నటుడు గుండెపోటుతో చనిపోయాడని ఆయన కుమారుడు వెల్లడించారు. చెల్లాదురై మృతికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా […]
కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. ఇప్పటికే ‘బాహుబలి, ఘాజీ, అరణ్య’ వంటి పాన్ ఇండియా మూవీస్ చేసిన రానా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను సిహెచ్ రాంబాబుతో కలిసి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్, రానా మూవీ షూటింగ్ పూర్తి కాగానే, రానాతో ఈ సినిమాను ప్రారంభిస్తామని నిర్మాతలు […]
ప్రముఖ యాంకర్ శ్యామల భర్త, బుల్లితెర నటుడు నరసింహారెడ్డి మంగళవారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఖాజాగూడకు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ నరసింహారెడ్డి తన దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నాడని, తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన నరసింహ రెడ్డి ఈ విషయంపై స్పందించిన వీడియోను శ్యామల తన ఇన్స్టాగ్రామ్ […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా… సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మే 13న థియేటర్లతో పాటు జీ ప్లెక్స్ లోనూ పే పర్ వ్యూ బేసిస్ లో […]