MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Adimulam: తిరుపతి జిల్లాలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపేలా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు, నారాయణవనం జెడ్పీటీసీ సభ్యుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిచామని, ఆ డబ్బులు తిరిగి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. సత్యవేడు నియోజకవర్గంలో తాము నలభై వేల మెజారిటీతో విజయం సాధించామని సుమన్ తెలిపారు. ఎన్నికల్లో ఎంతో కష్టపడి, ఖర్చు చేసి సీటు గెలుచుకున్నామని పేర్కొన్నారు. తాము పెట్టిన ఖర్చు తిరిగి ఇస్తే చాలని, వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.
Read Also: Spirit : రొమాన్స్ మూడ్ లోకి రెబల్ స్టార్.. ‘స్పిరిట్’లో ప్రేమ ఘాటు కాస్త ఎక్కువే
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
తన తండ్రి ఆదిమూలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సుమన్ వెల్లడించారు. పార్టీ తమ కుటుంబాన్ని గౌరవించడం లేదని, గౌరవం లేని చోట పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇంకా, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన సత్యవేడులో ఒక అగ్రవర్ణ వ్యక్తిని ఇన్‌చార్జ్‌గా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సత్యవేడులో అమలు కావడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.
అదే సమయంలో సత్యవేడు సీఐపై కూడా సుమన్ ఆరోపణలు చేశారు. రోజూ ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, వారిని సస్పెండ్ చేయడం లేదని మండిపడ్డారు. తన తండ్రిపై పార్టీ నాయకులే కుట్రలు చేశారని సుమన్ ఆరోపించారు. ఒక దళిత నేతను ఇంతలా వేధించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?