Pakistan: యూఏఈ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా.. గిన్నె పట్టుకుని దేశాల చుట్టూ పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇద్దరూ గిన్నెలు పట్టుకుని భిక్షం అడుక్కునే స్థాయికి దిగజారారు. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఏలా తయారైందంటే.. తక్కువ జీతం ఉండి, క్రెడిట్ కార్డుల ఉచ్చులో చిక్కుకున్న ఉద్యోగిలా మారింది. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ అన్నట్లుగా తయారైంది దాయాదిలా పరిస్థితి. తమ కడుపు నింపుకోవడానికే నాయా పైసా లేదు.. కానీ ప్రపంచ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ డబ్బులు వృథా చేసుకుంటుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఆర్థిక సంక్షోభానికి గురైన పాకిస్థాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) గట్టి దెబ్బ కొట్టింది. తాను ఇచ్చిన అప్పును వెంటనే చెల్లించాలని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. గడువు సైతం విధించడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ దిక్కుతోచని పరిస్థితిలోకి కొట్టుమిట్టాడుతున్నారు.
READ MORE: Spirit : రొమాన్స్ మూడ్ లోకి రెబల్ స్టార్.. ‘స్పిరిట్’లో ప్రేమ ఘాటు కాస్త ఎక్కువే
Also Read
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
ఇక చేసేంది ఏం లేక మళ్ళీ భిక్షాటన ప్రారంభించారు. యూఏఈకి చెల్లించాల్సిన 3 బిలియన్ డాలర్ల కోసం పాక్ పాలకులకు గత్యంతరం లేక ఇతర దేశాల ముందు చేయి చాచుతున్నారు. ఒకవైపు జనరల్ ఆసిమ్ మునీర్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపి, మధ్యవర్తిత్వం చేయడం ద్వారా చైనా, ఐఎంఎఫ్ (IMF), ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి తిరిగి రుణాలు పొందవచ్చనేది ఆయన ఎత్తుగడ. మరోవైపు ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, ఖతార్, తుర్కియే దేశాల చుట్టూ తిరుగుతున్నారు. సౌదీ అరేబియా వద్ద తమ దేశం ఎంత పేదరికంలో ఉందో వివరిస్తూ మొరపెట్టుకోవడంతో చివరికి వారు 3 బిలియన్ డాలర్ల అదనపు ఆర్థిక సాయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ 3 బిలియన్ డాలర్ల సాయంతో పాకిస్థాన్.. యూఏఈకి చెల్లించాల్సిన అప్పును వచ్చే వారం తీర్చనుంది. దీనికి తోడు ఇప్పటికే సౌదీ పాకిస్థాన్‌కు ఇచ్చిన 5 బిలియన్ డాలర్ల రుణ గడువును సైతం పొడిగించారు. వాస్తవానికి పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం 16 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని తాకలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఐఎంఎఫ్ షరతుల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి నిల్వలు 18 బిలియన్ డాలర్లకు చేరాలి. ఒకవేళ సొంత నిల్వలు ఖర్చు చేస్తే ఐఎంఎఫ్ నుంచి వచ్చే రుణాలు ఆగిపోతాయి, తద్వారా చమురు, గ్యాస్ వంటి నిత్యావసరాల దిగుమతి నిలిచిపోయి దేశం అంధకారంలోకి వెళ్తుంది. అందుకే అప్పు తీర్చడానికి కూడా మరో కొత్త అప్పు చేయక తప్పని దుస్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతోంది.
తాజావార్తలు
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!