మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిపై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యాడు. ఒక వ్యక్తి నా పేరుతో చీటింగ్ కు పాల్పడుతున్నాడని నా దృష్టికి వచ్చింది. అతను నాతో పాటు సినిమాల్లో నటించిన వారి నుంచి, ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నట్టు తెలిసింది. నా వైపు నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తులతో సంభాషించకండి’ అంటూ తన అభిమానులను […]
ప్రముఖ నటి సమీరా రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఏప్రిల్ లో సమీరా రెడ్డితో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడ్డారు. తాజాగా సమీరా భర్త అక్షయ్ వర్దే, వారి పిల్లలు నైరా, హన్స్ కరోనా నుంచి కోలుకున్నారని, ఇప్పుడు తన కుటుంబం సురక్షితంగా ఉందని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “కోవిడ్ నెగెటివ్. మా కుటుంబం సురక్షితంగా ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. గత 2 నెలలు మీతో గడిపిన ఫిట్‌నెస్ ఫ్రైడే […]
తలా అజిత్ తన 50వ పుట్టినరోజును ఈరోజు తన కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున సహ నటులు, సాంకేతిక నిపుణులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శివకార్తికేయన్, అనిరుధ్ రవిచందర్, హన్సిక, వేదిక, ఆదిలతో పాటు అనేక మంది ప్రముఖులు అజిత్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. శివకార్తికేయన్ అజిత్, దర్శకుడు శివలతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసుకున్నారు. అందులో ఓ పిక్ లో అజిత్‌తో కలిసి ఉన్న యువ శివకార్తికేయన్ […]
విశాఖ స్టీల్ ప్లాంట్ పై నీలినీడలు అలుముకున్న నేపథ్యంలో సత్యారెడ్డి తానే ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రజా యుద్థ నౌక గద్దర్ ఓ పాటను రాసి, పాడారు. ‘సమ్మె నీ జన్మహక్కురన్నో’ అనే ఈ లిరికల్ వీడియో పాటను మే డే సందర్భంగా గద్దర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటను సత్యారెడ్డితో పాటు ఇతర నటీనటులపై చిత్రీకరించారు. ఇప్పటికే వైజాగ్ లో […]
(నేడు ‘తల’ అజిత్ పుట్టిన రోజు)హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ఇవాళ తమిళనాడులో స్టార్ హీరో! రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్, విజయ్ నువ్వా- నేనా అన్నట్టుగా సాగుతున్నారు. మే 1 అజిత్ పుట్టిన రోజు. తమిళులు ‘తలా’ అని ప్రేమగా పిలుచుకునే అజిత్ కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ‘ప్రేమపుస్తకం’లో నటించడం విశేషం. అదీ గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో! ఈ సినిమా […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుందనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రాజెక్ట్ పై అప్డేట్ రానుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘SSMB28’పై ఈరోజు అధికారిక ప్రకటన రానుండడం మహేష్ అభిమానులను హుషారెత్తిస్తోంది. ‘SSMB28’ మూవీ స్టోరీ ఏంటనే విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే […]
అల్లు వారి ఫ్యామిలీని కరోనా చాలా ఇబ్బందే పెట్టేస్తోంది. అల్లు అరవింద్ ఇప్పటికే తాను కరోనా బారిన పడ్డానని అయితే వాక్సిన్ వేయించుకోవడం వల్ల అది తనను ఎక్కువ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఇక అల్లు అర్జున్ సైతం కరోనాతో హోమ్ ఐసొలేషన్ లో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు శిరీష్ సైతం తన కరోనా టెస్ట్ ఫలితాలను వెల్లడించారు. ఇంట్లో కొందరికి కరోనా వచ్చిన నేపథ్యంలో నిన్న, ఈ రోజు కూడా తాను కోవిడ్ 19 […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించింది. ఆమెకు విశేష ఖ్యాతిని తెచ్చిన ‘మణికర్ణిక’ చిత్రంపేరునే కంగనా తన బ్యానర్ కు పెట్టడం విశేషం. అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా ‘టికు వెడ్స్ షేరు’ పేరుతో సినిమా తీయబోతున్నట్టు కంగనా తెలిపింది. నిజానికి […]
ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ట్రైలర్ హానెస్ట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటూనే నవ్వులు కురిపిస్తోందంటూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సందీప్ కిషన్, మనోజ్ బాజ్పాయి తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ‘సినిమా బండి’ ట్రైలర్ […]
కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్ కరోనాకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. 2003 లో భారత సైన్యం నుండి రిటైర్ అయిన తరువాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. పలు సినిమాలు, ఓటిటి, టీవీ షోలలో నటించాడు బిక్రమ్‌జీత్ కన్వర్‌పాల్. ‘పేజ్ 3’, ‘ఆరాక్షన్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పయో’, ‘జబ్ […]