ఇప్పటి వరకూ వెండితెరపై పోటీ పడిన స్టార్స్ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీపై మక్కువ కనబరుస్తున్నారు. వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ లలో నటించడానికి అగ్రశ్రేణి తారలు ఆసక్తి చూపిస్తుండటంతో ఓటిటి ప్లాట్‌ఫాంల పరిధి కూడా పెరిగిపోతోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారమయ్యే తాజా కంటెంట్, వైవిధ్యమైన కథలు ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం నాగ చైతన్య అక్కినేని త్వరలో తన డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన భార్య సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’తో […]
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న’రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. కరోనా కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు మల్టీ ఫార్మాట్ రిలీజ్ కు ప్లానింగ్ చేశారు. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. అంటే అన్ని పిల్లలు సైతం […]
ఫిల్మ్ సెలబ్రిటీస్ పంథా మార్చుకున్నారు. కొవిడ్ 19 సెకండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్ననేపథ్యంలో వారూ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతవరకూ తమ సినిమా పబ్లిసిటీకి ఉపయోగించుకున్న సోషల్ మీడియాల మాధ్యమంతో కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతుగా సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారు. అయితే… యువ కథానాయకుడు అడివి శేష్… ఈ పనితో పాటు మరో గొప్ప పని కూడా చేశాడు. హైదరాబాద్ కోఠీ ప్రభుత్వ హాస్పిటల్ లో దాదాపు 300 కొవిడ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషించగా పవన్ కి జోడీగా శృతి హాసన్ కనిపించింది. ప్రకాష్ రాజ్ లాయర్ గా ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న […]
చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరూ కె.బాలచందర్ స్కూల్ లో తర్ఫీదు పొందినవారే. వీరిద్దరూ కలసి బాలచందర్ ‘ఇది కథ కాదు’లో నటించారు. చిరంజీవి, కమల్ హాసన్ ఇద్దరికీ ఓ చిత్రంతో బంధం ఉంది. అలాగే రాజకీయాల్లోనూ వారిద్దరి నడుమ ఓ పోలిక పొడసూపింది. ఆ వివరాల్లోకి వెళ్తే – చిరంజీవి తమ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై తొలి చిత్రం ‘రుద్రవీణ’కు తన గురువు కె.బాలచందర్ నే దర్శకునిగా ఎంచుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ‘ది […]
పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జయ కేతనం ఎగరేసిన నేపథ్యంలో పలు నియోజక వర్గాలలో హింస చెలరేగింది. బీజేపీ, ఏబీవీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని చోట్ల టీసిఎం కార్యకర్తలు వాటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన బీజేపీ కార్యకర్తలు, పోలీసులపై దాడి చేశారు. బీజేపీ సానుభూతి పరుల దుకాణాలను కొన్ని చోట్ల లూఠీ చేశారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ […]
నటుడు విశ్వక్ సేన్ తన అసలు పేరు రివీల్ చేశాడు. ‘ఫలక్ నామా దాస్’తో పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ‘హిట్’తో తొలి హిట్ కొట్టాడు. ఆరంభంలో ‘వెళ్ళిపోమాకె’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ‘ఫలక్ నామాదాస్’తో వచ్చింది. ప్రస్తుతం విశ్వక్ నటించిన ‘పాగల్’ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవల ఇతగాడు తన అసలు పేరును బయట పెట్టాడు. హైదరాబాద్ గాంధీ హాస్పటల్ లో పుట్టి దిల్ సుఖ్ నగర్ లో […]
రచయిత అనిల్ రావిపూడిలోని ప్రతిభను గుర్తించిన నందమూరి కళ్యాణ్ రామ్ అతన్ని ‘పటాస్’ మూవీతో దర్శకుడిని చేశారు. ఆ సినిమా చక్కని విజయం సాధించడంతో ఇక అనిల్ రావిపూడి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలానే నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అయిన అనిల్ రావిపూడి, ఆయనతో సినిమా చేసే ఛాన్స్ కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది. బాలయ్య – అనిల్ కాంబినేషన్ లో మూవీకి […]
తెలుగులో త్వరలో రాబోతున్న సినిమాలను, సెట్స్ పైకి వెళ్ళబోతున్న చిత్రాలను ఒకసారి గమనించండి… మీకో యూనిక్ పాయింట్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుండి నవతరం హీరోల వరకూ అందరూ పరభాషా దర్శకులవైపు మొగ్గు చూపుతున్నారు. మాతృకను డైరెక్ట్ చేశారనే కారణంగా కొందరికి ఇక్కడ అవకాశం ఇస్తుంటే… మన హీరోలను భిన్నంగా తెరపై ప్రజెంట్ చేస్తారనే నమ్మకంతో మరికొందరు ఛాన్స్ పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేయబోతున్న సినిమా ‘లూసిఫర్’. నిజానికి మలయాళంలో దీనిని నటుడు పృథ్వీరాజ్ […]