300 మంది కరోనా పేషంట్స్ దాహార్తి తీర్చిన అడివి శేష్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిల్మ్ సెలబ్రిటీస్ పంథా మార్చుకున్నారు. కొవిడ్ 19 సెకండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్ననేపథ్యంలో వారూ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఇంతవరకూ తమ సినిమా పబ్లిసిటీకి ఉపయోగించుకున్న సోషల్ మీడియాల మాధ్యమంతో కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. ఆపన్నులను ఆదుకోవడానికి తమ వంతుగా సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారు. అయితే… యువ కథానాయకుడు అడివి శేష్… ఈ పనితో పాటు మరో గొప్ప పని కూడా చేశాడు. హైదరాబాద్ కోఠీ ప్రభుత్వ హాస్పిటల్ లో దాదాపు 300 కొవిడ్ పేషెంట్స్ చికిత్స చేయించుకుంటున్నారు. అయితే… అక్కడ తాగునీటి సమస్య ఏర్పడిందనే విషయం సోషల్ మీడియా ద్వారా అడివి శేష్ దృష్టికి వచ్చింది. కరోనా బాధితులతో పాటు అక్కడి వైద్య సిబ్బంది సైతం డీహైడ్రేషన్ కు గురౌతున్నారనే విషయాన్ని గ్రహించిన అడివి శేష్ వెంటనే 850 లీటర్ల వాటర్ బాటిల్స్ ను హాస్పిటల్ కు పంపారు. అలానే ఆ హాస్పిటల్ అవసరాలకు సరిపడ త్రాగునీటిని సరఫరా చేసేందుకు శాశ్వత ప్రణాళికకూ తాను సహకరిస్తానని హామీ ఇచ్చాడు. సమయానికి కరోనా బాధితులను ఆదుకున్న అడివి శేష్ ను అక్కడి వారు అభినందించారు. విశేషం ఏమంటే… అడివి శేష్ సైతం ఓ డాక్టర్ కొడుకే! అందుకే రోగుల కష్టాలను అతను చక్కగా అర్థం చేసుకున్నాడు!!
Also Read
- Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
- Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
తాజావార్తలు
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
-
Geetu Mohandas: “నేను రాసిందొకటి.. తీసిందొకటి”.. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?