మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-4 అంటూ ఈరోజు సాయంత్రం ఓ వీడియోను విడుదల చేసింది. “ప్రపంచం మారవచ్చు. అభివృద్ధి చెందవచ్చు.. కానీ మేము ఎప్పటికీ మారము. మేము అందరం ఒక పెద్ద కుటుంబంలో భాగం” అంటూ ఈ వీడియోను షేర్ చేశారు మార్వెల్ సంస్థ వారు. అందులో గతంలో వచ్చిన సూపర్ హీరో చిత్రాలతో పాటు భవిష్యత్ లో రానున్న చిత్రాలకు సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ‘ఎవెంజర్స్’ సిరీస్, ‘యాంట్ మ్యాన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘డాక్టర్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. మరోవైపు పవన్ కూడా కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంగా మారే వరకు సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వదు. అయితే ఈ చిత్రం పవన్ తో సాయి పల్లవి జోడి కట్టనుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తెలియని కారణాలతో ఆఖరి […]
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రీమేక్ లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇంతకుముందు ‘దృశ్యం’ మలయాళ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మరో రెండు రీమేక్ లలో నటిస్తున్నాడు. రీమేక్ చిత్రాలైన దృశ్యం-2, నారప్ప సినిమాల షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేశాడు వెంకటేష్. ఇప్పుడు వెంకటేష్ హీరోగా మూడవ రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం మలయాళ […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేష్ తో తమ తమ ప్రాజెక్టులను అనౌన్స్ చేసుకున్నారు. అయితే తాజా సమాచారం ఏంటంటే… ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి కారణం స్క్రిప్ట్ అంటున్నారు. ‘అల వైకుంఠపురం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఎన్టీఆర్30 స్క్రిప్ట్ ను చాలా తేలికగా తీసుకున్నాడట. ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ ప్రకటించిన సంవత్సరం తరువాత కూడా […]
మొన్న జరిగిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పని చేసిందనే కొందరు అంటున్నారు. పని చేస్తే మరి పవన్ కళ్యాణ్ మద్దతు పలికిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు డిపాజిట్ కూడా ఎందుకని దక్కలేదు అని ప్రశ్నించవచ్చు. అయితే ఇక్కడే ఉంది అసలు సంగతి. 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకొని తన జనసేనతో ఎన్నికల బరిలోకి దిగారు. అప్పడు బీఎస్పీ పార్టీకి […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కునున్న హ్యాట్రిక్ మూవీని ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రంలో మహేష్ ‘రా’ ఏజెంట్ గా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ ఆసక్తికర టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘పార్థు’ అనే టైటిల్ ను ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28 టైటిల్‌గా ఖరారు చేయాలని భావిస్తున్నారట. మహేష్ బాబుకు కూడా ఈ టైటిల్ నచ్చిందట. కానీ ఇంకా టైటిల్ పై తుది […]
దేశం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి సమయంలో తమ అభిమానుల్లో మనోధైర్యం నింపడానికి, మునుపటి ఉత్తేజం కలిగించడానికి నటీనటులు తమ టాలెంట్ ను వాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దివా, డ్యాన్సర్ నోరా ఫతేహి ఓ వీడియోతో అభిమానులను అలరించారు. నోరా… సీన్ పాల్ వైరల్ సాంగ్ ‘టెంపరేచర్’కు వైవిధ్యంగా డ్యాన్స్ చేసి ఆ వీడియోతో తన అభిమానులను ఉల్లాస పరిచింది. ఆమె తన స్నేహితుడు, మేకప్ ఆర్టిస్ట్, హెయిర్‌స్టైలిస్ట్ మార్స్ పెడ్రోజోతో కలిసి చేసిన ఈ సరదా వీడియోను […]
కరోనా కష్ట కాలంలో తమ వంతు సాయం చేయడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు సెలెబ్రిటీలు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే చాలామంది ప్రాణాలు బలి తీసుకుంది కరోనా మహమ్మారి. అయితే అలా కరోనాతో ప్రాణాలొదిలేసిన చాలా కుటుంబాల్లో మిగతా వారు అనాథలుగా మిగులుతున్నారు. ముఖ్యంగా కరోనా కారణంగా తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతే అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మారిపోతున్నారు. ఇలాంటి సమయంలో వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. […]
ప్రముఖ నటుడు సాయికుమార్ తన చుట్టూ ఉన్న వారికి ఏ ఆపద వచ్చినా తనవంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. కరోనా కష్ట కాలంలోనూ తన వంతు సాయం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో సాయికుమార్ సోషల్ మీడియా ద్వారా ఓ పిలుపునిచ్చారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, అది వేసుకుంటే ప్రాణాలకు ఢోకా ఉండదని హితవు పలికారు. ‘పోలీస్ స్టోరీ’లోని పాపులర్ డైలాగ్ ను ప్రస్తుత పరిస్థితికి అన్వయిస్తూ […]
తమిళ చిత్రసీమలో సూర్య నటించిన ‘గజిని’కీ ఓ ప్రత్యేక స్థానం ఉంది. అక్కడే కాదు తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఇక్కడా సూపర్ హిట్ అయ్యింది. విశేషం ఏమంటే… ‘గజిని’ చిత్రాన్ని అల్లు అరవింద్ మిత్రులతో కలిసి ఆమీర్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ చేసి అక్కడా సూపర్ హిట్ ను అందుకున్నారు. అందుకే అల్లు అరవింద్ కు సైతం ‘గజిని’ ఓ స్పెషల్ మూవీ. ఇంతకూ విషయం ఏమంటే… తమిళ దర్శకుడు మురుగదాస్ సూపర్ […]