బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కరోనా బారిన పడిన సెలెబ్రిటీల జాబితాలో చేరిపోయింది. తాజాగా దీపికాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం దీపికా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కోవిడ్ నుండి కోలుకోవడానికి ఆమె డాక్టర్లు సూచించిన మందులు తీసుకుంటోంది. దీపికా ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీపికా తల్లిదండ్రులు, చెల్లెలికి కరోనా సోకింది. దీపికా తండ్రి ప్రస్తుతం బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో […]
కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్ధశతాబ్దం’. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది ఈ చిత్రం. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఒక మెయిన్ ఇష్యూను తీసుకుని, దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ‘అర్ధశతాబ్దం’ను తెరకెక్కిస్తున్నారు. రవీంద్ర పుల్లే […]
త్రిష కృష్ణన్ దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన హీరోయిన్లలో ఒకరు. ఇప్పుడు ఈ చెన్నైచంద్రం త్రిష పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా మరో హీరోయిన్ చేసిన ట్వీట్ తో త్రిష పెళ్లి ఫిక్స్ అయినట్టే అంటున్నారు నెటిజన్లు. ఈరోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో త్రిషకు అత్యంత్య […]
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో షాలిని పాండే హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అన్ని ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రంతో ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో విజయ్ దేవరకొండ జీవించేశాడు. టాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అంతేనా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కూడా బాక్సాఫీస్ […]
స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై విశ్వంత్, మాళవిక జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది. నిన్న ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. […]
‘సత్య’ మూవీతో ముంబై అండర్ వరల్డ్ దృష్టిలో పడటమే కాదు ఆ చీకటి సామ్రాజ్యాన్ని సినిమా ప్రేక్షకులకూ రామ్ గోపాల్ వర్మ పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన ‘కంపెనీ’ మూవీ సైతం చక్కని ప్రేక్షకాదరణ పొందింది. ఆ ఊపుతో అదే జానర్ లో మరి కొన్ని సినిమాలు తీశాడు కానీ ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు. మళ్ళీ ఇంతకాలానికి వర్మ ముంబై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం జీవితంలోని […]
ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ప్రముఖ నటి దీపికా పదుకొనె తండ్రి ప్రకాష్ పదుకొనెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రకాష్ కరోనా నుండి కోలుకుంటున్నారు. 1980లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడైన ప్రకాష్ పదుకొనె ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకు ఇప్పుడు 65 ఏళ్ళు. 10 రోజుల క్రితం ప్రకాష్, అతని భార్య ఉజ్జల, అతని రెండవ […]
కోవిడ్ -19 సెలెబ్రిటీలు, సాధారణ జనం అనే తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటోంది. ఈ మహమ్మారి కారణంగా ఇండియాలో లక్షలాది మంది మరణిస్తున్నారు. ఇంకా చాలా మంది ఆసుపత్రులలో వైరస్ తో పోరాడుతున్నారు. కరోనాతో పలువురు సెలెబ్రిటీలు తమకు ఇష్టమైన వారిని పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి సోదరుడిని కరోనా బలి తీసుకుంది. నిక్కీ సోదరుడు, 29 ఏళ్ల జతిన్ తంబోలి ఈ ఉదయం కరోనావైరస్ తో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కూతురు ఆద్య బుల్లితెర ఎంట్రీ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆద్య ఓ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ‘డ్రామా జూనియర్స్’ షోలో పాల్గొని బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సదరు షోకు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా… అందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆద్య. ‘డ్రామా జూనియర్స్’ షోకు రేణూ దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆద్య అలా వేదికపై కన్పించడంతో […]
తెలుగుతో పాటు దక్షిణాది భాషా చిత్రాల్లోనూ, హిందీలోనూ నటించిన పియా బాజ్ పాయ్ మంగళవారం ఉదయం తన సోదరుడిని కోల్పోయింది. కొద్దికాలం క్రితం పియా బాజ్ పాయ్ సోదరుడు కరోనా బారిన పడ్డాడు. అతన్ని హాస్పిటల్ లో చేర్పించడానికి ఆమె తన స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేసింది. చివరకు ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అతన్ని చేర్పించింది. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయం పడింది. అందుకోసం ఆమె సోషల్ మీడియా […]