పొరుగు దర్శకులపై టాలీవుడ్ హీరోల మొగ్గు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో త్వరలో రాబోతున్న సినిమాలను, సెట్స్ పైకి వెళ్ళబోతున్న చిత్రాలను ఒకసారి గమనించండి… మీకో యూనిక్ పాయింట్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుండి నవతరం హీరోల వరకూ అందరూ పరభాషా దర్శకులవైపు మొగ్గు చూపుతున్నారు. మాతృకను డైరెక్ట్ చేశారనే కారణంగా కొందరికి ఇక్కడ అవకాశం ఇస్తుంటే… మన హీరోలను భిన్నంగా తెరపై ప్రజెంట్ చేస్తారనే నమ్మకంతో మరికొందరు ఛాన్స్ పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేయబోతున్న సినిమా ‘లూసిఫర్’. నిజానికి మలయాళంలో దీనిని నటుడు పృథ్వీరాజ్ డైరెక్ట్ చేశాడు. కానీ తెలుగు రీమేక్ దగ్గరకు వచ్చే సరికీ ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ తనయుడు రాజా చేతిలో ఈ ప్రాజెక్ట్ ను పెట్టారు. అతను గతంలో తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ మూవీ తీశాడు. ఇక ‘దృశ్యం 2’ను తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్ మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసేఫ్ నే రంగంలోకి దించాడు. ఇక ప్రభాస్ అయితే… సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ను, ఓంరౌత్ తో ‘ఆది పురుష్’ మూవీని చేస్తున్నాడు. రామ్ సైతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది ‘క్లాప్’ అనే సినిమాను తమిళ దర్శకుడు పృథ్వీ ఆదిత్యతో చేస్తున్నాడు. అలానే ‘పుష్ప’ చిత్రం పూర్తి కాగానే అల్లు అర్జున్ సైతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. మొత్తం మీద మన స్టార్ హీరోలు అందరూ పొరుగు దర్శకుల ప్రతిభా పాటవాల మీద భలే గురి పెంచుకున్నారు. మరి వారి నమ్మకానికి తగ్గ ఫలితాలు దక్కితే మంచిదే!
Also Read
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Tags
- Chiranjeevi
- Tollywood
తాజావార్తలు
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
-
Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!