-
చిరుతో సుజీత్ తమిళ రీమేక్ ?
“సాహో” చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. అయితే ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో ఇక సుజీత్ కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా అవకాశం పట్టేశాడు. మలయాళ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ కు దర్శకత్వం వహించడానికి సుజీత్ ను మొదటగా ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో సుజీత్ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు. కానీ మెగాస్టార్ కోసం సుజీత్ మరో తమిళ రీమేక్ ను సిద్ధం […] -
నెక్ట్స్ షెడ్యూల్ కు సిద్ధమవుతోన్న ‘గని’
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్క బడగానే మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘మా ‘గని’ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడగానే […] -
“18 పేజెస్” ఫస్ట్ లుక్ అప్డేట్
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “18 పేజెస్”. తాజాగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ఒక వైపు చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకొని, మరోవైపు ఒక వ్యక్తి పేజీలో వ్రాస్తున్నట్లు ఉండడం చూడొచ్చు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం […] -
దిల్ రాజు సొంత ఓటీటీ ప్లాన్స్!?
దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు దాదాపు పది చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో రెండు హిందీ రీమేక్స్ కూడా ఉన్నాయి. అలానే ఆయన చేతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందలాది థియేటర్లు ఉన్నాయి. ఇక ప్రతిష్ఠాత్మక చిత్రాలెన్నింటినో ఆయన పంపిణీ చేస్తుంటారు. అయితే… కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో థియేటర్లు మూతపడటంతో వాటి లీజుదారులందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. థియేటర్లు నడవకపోయినా ఎంతో కొంత మొత్తాన్ని దాని మెయిన్ టెన్స్ కు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. […] -
ఆరు కేంద్రాలలో గాయని స్మిత సాయం!
కరోనా కష్టకాలంలో బాధితులను ఆదుకోవడానికి, తమకు తెలిసిన వారి సాయంతో పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. గాయనీ స్మిత సైతం ఈ జాబితాలో చేరారు. ఎ.పి. ఎంటర్ పెన్యూర్ ఆర్గనైజేషన్, ఈషాకు చెందిన అలై ఫౌండేషన్ సహకారంతో స్మిత రెండు తెలుగు రాష్ట్రాలలో ఆరు ప్రాంతాలలో కొవిడ్ బాధితులను రక్షించే పనిలో పడ్డారు. విజయవాడ, వెస్ట్ గోదావరి, అనంతపూర్, శ్రీకాకుళం, హైదరాబాద్, విశాఖపట్నంలో హెల్ప్ లైన్స్ ను ఏర్పాటు చేసి బాధితులకు సహాయాన్ని అందిస్తున్నారు. దీనితో పాటు […] -
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరో మైల్ స్టోన్…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దక్షిణాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 12 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని మరో మైలు రాయిని దాటారు. ఇటీవలే విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టాలో 12 మిలియన్ల ఫాలోవర్లను దాటిన […] -
ఎన్టీయార్ అభిమానులకు స్మాల్ సర్ ప్రైజ్ ఇదే!
ఎన్.బి.కె. ఫిలిమ్స్ బ్యానర్ లో తొలిసారి నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీయార్ బయోపిక్ ను రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఆయనకు అసలు సిసలు నట వారసుడైన బాలకృష్ణకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ, అభిమానం అంతకు మించి గౌరవం. సందర్భం ఏదైనా తన తండ్రిని తనలో చూసుకోవడం ఆయనకు అలవాటు. ఆ మధ్య భీష్మ ఏకాదశికి గతంలో తాను తండ్రిని అనుకరిస్తూ వేసిన భీష్ముడి గెటప్ ను విడుదల చేశారు బాలకృష్ణ. అలానే ఎన్టీయార్ ‘జగదేకవీరుని కథ’లోని […] -
వెనక్కి తగ్గిన ‘మేజర్’
అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో టెర్రరిస్టులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు […] -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు
కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ ప్రకటించినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, […] -
డేటింగ్ యాప్ లో నటి ఫోటో .. పోలీసులకు ఫిర్యాదు!
టెక్నాలజీ వాడకం పెరిగిపోయాక అదే టెక్నాలజీ అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ నటి షకీలా నటించిన ‘శీలవతి’ లాంటి కొన్ని సినిమాల్లో నటించిన నటి గీతాంజలి (ఫ్రూటీ)కి ఆన్లైన్ వేధింపులు తప్పలేదు. కొందరు ఆకతాయి వ్యక్తులు తన ఫోటోను ఒక డేటింగ్ యాప్ లో పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్ లో తన ఫోటోలు పెట్టడం […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!