తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. వారంలోగా ఈ ఏర్పాటు చేస్తామని మెగాస్టార్ ప్రకటించినట్టే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు బుధవారం సాయంత్రానికి ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి. బ్లడ్ బ్యాంక్ నుంచి ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు.. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కాన్ సన్ ట్రేటర్లు పంపించారు. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో ఈరోజు బుధవారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. ప్రతి జిల్లాల్లో ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ కావాలని కోరగానే సిలిండర్లను పంపిస్తారు. అవసరాన్ని బట్టి ఈ పంపిణీ ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించారు.
Also Read
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- లవ్ ఎమోషనల్ రైడ్ గా ‘ప్రేమ డైరీలో చివరి పేజీలు’
- Toxic Fan Culture: అభిమానమా? ఉన్మాదమా? ఉ*గ్రవాదమా? ఎక్కడపడితే అక్కడ టచ్ చేస్తారా?
ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ –చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్కడ స్కార్సిటీ వల్ల చైనా నుంచి ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్లు ఆర్డర్ చేశాం. ప్రస్తుతం చాలా చోట్ల వీటి కొరత నెలకొంది. అత్యవసరంగా ఎక్కడ అవసరం ఉంది అనేది తెలుసుకొని ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. అన్ని జిల్లాలకు అవసరం ఉన్న అన్నిచోట్లకు పంపిణీ చేస్తాం. అలాగే ప్రతిచోటా ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ టైంలో చేరుకుంటున్నాయి అనేది ట్రాకింగ్ పరికరాన్ని కూడా టెక్నీషియన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీసు నుంచి పర్యవేక్షణ ఉంటుంది. అన్నిచోట్లా ఇది సద్వినియోగం కావాలనే మా ప్రయత్నం. రామ్ చరణ్ ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు అని అన్నారు.
Mission begins. Let there be no deaths due to lack of life saving oxygen. #Covid19IndiaHelp #ChiranjeeviOxygenBanks @AlwaysRamCharan https://t.co/eRFpTIXOKe
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 26, 2021
- Tags
- Chiranjeevi
- Oxygen Bank
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!