US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
- హోర్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు.
- IRGC కఠిన వైఖరి.. అమెరికాపై ఒత్తిడి కొనసాగించాలని పట్టుదల.
- చర్చల ద్వారా పరిష్కారం కోరుతున్న పెజెష్కియన్ ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి విషయంలో ఇప్పుడు ఇరాన్లో అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి, ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. IRGCకి చెందిన కఠిన వైఖరి గల కమాండర్లు, హోర్ముజ్ జలసంధిపై తమ నియంత్రణను ఏ విధంగానైనా కాపాడుకోవాలని, అమెరికాకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించాలని కోరుకుంటుండగా, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని ఇరాన్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాయి.
సౌఫాన్ సెంటర్లోని సీనియర్ విశ్లేషకుడైన కెన్నెత్ కాట్జ్‌మాన్ ప్రకారం, ప్రస్తుతం ఇరాన్లో రెండు విభిన్న ఆలోచనలు పనిచేస్తు్నాయని, హార్ముజ్‌పై నియంత్రణ కోసం ఐఆర్జీసీ కమాండర్లు కఠినంగా ఉన్నారని చెప్పారు. దీంతో పాటు తమ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటోంది. భవిష్యత్తులో అమెరికా ఇరాన్‌పై దాడి చేయకుండా ప్రతీకారం ఇవ్వాలని ఇరాన్ మిలిటరీ భావిస్తోంది.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
అంతర్గత విభేదాలు:
అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఘాలిబాఫ్ వంటి నాయకులు యుద్ధాన్ని తీవ్రతరం చేయడం కన్నా చర్చలకు వెళ్లడం బెటర్ అని భావిస్తున్నారు. ఒమన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు మళ్లీ ప్రారంభించి, హార్ముజ్‌పై ఒక ఒప్పందానికి రావాలని ఇరాన్లో ఎన్నికైన ప్రభుత్వం కోరుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచంలో 20 శాతం ఇంధన ఎగుమతులు జరిగే హార్ముజ్‌లో స్వేచ్ఛాయుత నౌకాయానం ఉండాలని అమెరికా భావిస్తోంది. అయితే, హార్ముజ్ కంట్రోల్ తమదే అని ఇరాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఒక వేళ హార్ముజ్ జలసంధిని మూసేస్తే ఇరాన్‌పై అమెరికా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక వేళ ప్రభుత్వం, మిలిటరీపై ఒత్తిడి తీసుకువస్తే, ఒమన్ మధ్యవర్తిత్వంతో కొత్త ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!