టెక్నాలజీ వాడకం పెరిగిపోయాక అదే టెక్నాలజీ అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ నటి షకీలా నటించిన ‘శీలవతి’ లాంటి కొన్ని సినిమాల్లో నటించిన నటి గీతాంజలి (ఫ్రూటీ)కి ఆన్లైన్ వేధింపులు తప్పలేదు. కొందరు ఆకతాయి వ్యక్తులు తన ఫోటోను ఒక డేటింగ్ యాప్ లో పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్ లో తన ఫోటోలు పెట్టడం తో కొంతమంది తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అంశం మీద దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక ఇటీవలే సింగర్ మధుప్రియ తనకు కొన్ని ఫోన్ నెంబర్ల నుంచి బ్లాంక్ కాల్స్ వరుసగా వస్తున్నాయని షి టీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.