Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- తమిళనాడులో INDIA కూటమిలో విభేదాలు.
- విజయ్ నేతృత్వంలోని TVKతో పొత్తును తిరస్కరించిన డీఎంకే.
- కాంగ్రెస్ తమను రాజకీయంగా ద్రోహం చేసిందని డీఎంకే ఆరోపణ.
- బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యత కోరుతున్న కాంగ్రెస్, VCK.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడు ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు ఎలా ఉన్నా, జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి సహకరించుకోవాలని విజయ్ ప్రభుత్వంలో కీలక పార్టీగా ఉన్న వీసీకే పిలుపునిచ్చింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. టీవీకేను ఇండియా కూటమిలోకి తీసుకురావాలని వీసీకే పిలుపును డీఎంకే వ్యతిరేకించింది. కేరళ,పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయ విధానాన్ని అనుసరించాలని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ప్రతిపాదించడంపై డీఎంకే వ్యాఖ్యానిస్తూ, ఆ రాష్ట్రాల మోడల్ తమిళనాడులో నడవదని చెప్పింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్నికల తర్వాత విజయ్‌తో చేతులు కలిపింది. తమను కాంగ్రెస్ ద్రోహం చేసిందని డీఎంకే ఆరోపిస్తూ.. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో టీవీకేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. డీఎంకే ఎంపీ గణపతి పి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కేవలం మంత్రి పదవుల కోసం టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపి, డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఇప్పుడు డీఎంకేను ఒప్పించడానికి వీకేసీని పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్‌పై ఆరోపించారు. పార్లమెంట్లో ఒక్కసీటు కూడా లేని టీవీకేను కూటమిలో చేర్చాలా.? అనే దానిపై సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మాత్రం బీజేపీని ఎదుర్కోవడానికి విస్తృత ప్రతిపక్ష ఐక్యత అవసరమని అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ స్పందిస్తూ.. ముందుగా విజయ్ను ఒప్పంచండి, ఆయన డీఎంకేనూ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా చెబుతున్నారని, అలాంటప్పుడు ఎలా కలిసి పనిచేస్తారు.? అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!