దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు దాదాపు పది చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో రెండు హిందీ రీమేక్స్ కూడా ఉన్నాయి. అలానే ఆయన చేతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందలాది థియేటర్లు ఉన్నాయి. ఇక ప్రతిష్ఠాత్మక చిత్రాలెన్నింటినో ఆయన పంపిణీ చేస్తుంటారు. అయితే… కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో థియేటర్లు మూతపడటంతో వాటి లీజుదారులందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. థియేటర్లు నడవకపోయినా ఎంతో కొంత మొత్తాన్ని దాని మెయిన్ టెన్స్ కు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో లీజ్ పూర్తయిన థియేటర్లను వదిలిపెట్టేస్తే బెటర్ అనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చారని తెలుస్తోంది. ఇదే సమయంలో థియేటర్ల నిర్వహణపై పెట్టే దృష్టిని ఓ సొంత ఓటీటీపై పెడితే బెటర్ అని ఆయన అనుకుంటున్నారట. ఇప్పటికే ఆహాలో దిల్ రాజు కుమార్తె, అల్లుడు భాగస్వామిగా ఉన్నారు. అయినా కూడా దిల్ రాజు తన సొంత సినిమాలను ఓటీటీ విడుదలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వేరే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఇస్తున్నారు కానీ ఆహాకు ఇవ్వడం లేదు. సో… మొదటి నుండి ఆయన బిజినెస్ పరంగా తనకు ఏది మేలు చేస్తే అదే చేసుకుంటూ వచ్చారు. రాబోయే రోజుల్లో సొంత ఓటీటీని ఏర్పాటు చేస్తే… తన చిత్రాలను, తాను పంపిణీ చేయాలనుకున్న చిత్రాలను దాంట్లోనే విడుదల చేయొచ్చని ఆలోచిస్తున్నారట. ఇక ఓటీటీ అంటూ పెడితే… దానికి తగ్గ రేంజ్ లో బడ్జెట్ చిత్రాలనూ నిర్మించడం దిల్ రాజుకు పెద్ద పనేం కాదు! ఆ మందీ మార్బటం ఆయనకు ఉండనే ఉంది. మరి దిల్ రాజు తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఎప్పుడు పెదవి విప్పుతారో చూడాలి.