నెక్ట్స్ షెడ్యూల్ కు సిద్ధమవుతోన్న ‘గని’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్క బడగానే మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘మా ‘గని’ సినిమా ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్త చక్కబడగానే నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీరణను స్టార్ట్ చేస్తాం. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం. వరుణ్ తేజ్ ఈ లాక్డౌన్ సమయంలోనూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో వరుణ్‌గారు, ఇతర ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలు సహా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇందు కోసం ఆర్ట్ డైరెక్టర్ భారీ స్టేడియం సెట్‌ను కూడా వేశారు. అలాగే హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఆధ్వర్యంలో ఈ షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ చిత్రీకరణ చేస్తాం. ఈ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసిన తర్వాత రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రకటన చేస్తాం’’ అన్నారు.
బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్‌తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్‌తో బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read
- Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
- OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
- Renu Desai: 'ఓం' ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
- Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్‌కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!