“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం హిందీలోనే విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. సినిమా ఊహించని విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం సంతోషంగా ఉంది. అయితే తాజాగా “ది కాశ్మీర్ ఫైల్స్” నిర్మాత అభిషేక్ అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. అసలు […]
గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు కార్తికేయ. పాత్ర నచ్చాలే కానీ ప్రతి నాయకుడి పాత్రకైనా సై అనే కార్తికేయ ఆ మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ, ఇటీవల అజిత్ ‘వలిమై’లోనూ విలన్ పాత్రలే పోషించాడు. కానీ ఆ సినిమాలు కూడా అతనికి నిరుత్సాహాన్ని కలిగించాయి. తాజాగా కార్తికేయ హీరోగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. Read Also : Hari […]
యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ను శుక్రవారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ‘టైటిల్ కి తగిన విధంగా ఈ చిత్రంలో ఆది విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడ’ని చెప్పారు. టైటిల్ పోస్టర్ కూల్ అండ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి ప్రముఖ కళాదర్శకులు ‘పద్మశ్రీ’ తోట తరణి కళా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం తోట తరణి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ స్పాట్ కి వచ్చిన సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం అందించి హార్ధిక స్వాగతం పలికారు. పద్మశ్రీ పురస్కారాలు, జాతీయస్థాయి ఉత్తమ కళాదర్శక అవార్డులు అందుకున్న తరణి గారి నేతృత్వంలో ఈ చిత్రం సెట్స్ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. […]
అల్లు అర్జున్ పుట్టిన రోజంటే అభిమానులకు పండగ రోజు కింద లెక్క. తమ హీరోల పుట్టిన రోజున చాలా మంది తమ ఊళ్ళలో సేవాకార్యక్రమాలు చేస్తుంచారు. చిరంజీవి అభిమానులైతే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే చిత్రసీమలోనూ హీరోలకు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు తమదైన స్టైల్ లో బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ ఫేమ్ తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రైడా అదే చేశాడు. శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే […]
“పుష్ప” సక్సెస్‌తో దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. “పుష్ప” ఇచ్చిన సక్సెస్ తో ఈ బర్త్ డేను మరింత ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. అయితే ఆ సెలెబ్రేషన్స్ ఇక్కడ కాదు విదేశాల్లో జరిగాయి. Allu Arjun Birthday Celebrationsకి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఐకాన్ స్టార్ పుట్టినరోజు వేడుకలు సెర్బియాలో జరిగాయి. బర్త్ డే కోసమే కుటుంబంతో సహా తనకు అత్యంత […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా “గని” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందనే రాగా, ఈ సినిమా కన్నడ వెర్షన్ […]
పోర్న్ స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ కొన్నేళ్ళుగా వెండితెరపై దృష్టి పెట్టింది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ నటిస్తోంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’తో పాటు రాజశేఖర్ ‘గరుడవేగ’లోనూ నటించింది. తాజా మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ మూవీలో రేణుక అనే లీడ్ క్యారెక్టర్ చేస్తోంది సన్నీ లియోన్. Read Also : HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ… […]
పాన్ ఇండియా ఫీవర్ కారణంగా టాలీవుడ్ లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. చిన్న, మధ్య తరగతి హీరోలు సైతం తెలుగులో తీసిన సినిమాను ఇతర భాషల్లోనూ డబ్ చేసి, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలైతే చాలానే వరుస కట్టాయి. సమంత నటిస్తున్న ‘శాకుంతలం’, ‘యశోద’ రెండూ పాన్ ఇండియా మూవీసే. వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న సినిమాలనూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల […]
బాలీవుడ్ కండల వీరుల్లో మేటి అనిపించుకున్న జాన్ అబ్రహామ్ హీరోగా మెప్పించడమే కాదు, నిర్మాతగా, కథకునిగానూ రక్తి కట్టించాడు. జాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎటాక్’కు ఆయనే కథకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘ఎటాక్-2’ తీస్తే అందులో తనతో పాటు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తే ఈ సారి బంపర్ హిట్ ఖాయమని ఈ మధ్యే చెప్పాడు. ఇప్పుడు తన మనసులోని మరో కోరికను […]