Ghani : కన్నడ వెర్షన్ రిలీజ్ వాయిదా… కారణమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా “గని” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందనే రాగా, ఈ సినిమా కన్నడ వెర్షన్ రిలీజ్ మాత్రం వాయిదా పడింది. దీంతో కర్ణాటకలో ఉన్న మెగా అభిమానులు అయోమయంలో పడ్డారు.
Read Also : Shoot Life: విష్ణు విషయంలో మరోసారి భంగపడ్డ పోర్న్ స్టార్!
Also Read
అంతకుముందు “గని” మూవీ ప్రెస్ మీట్‌లో నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్దా ఈ చిత్రాన్ని కన్నడలో (డబ్బింగ్ వెర్షన్) ఏప్రిల్ 8న అంటే ఈరోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు కన్నడ వెర్షన్ ప్రమోషన్స్ ను స్టార్ యాక్టర్ ఉపేంద్ర చూసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. కానీ అందరూ అనుకున్నట్టుగా కన్నడ వెర్షన్ ఈరోజు విడుదల కాలేదు. ఆ విషయం గురించి మేకర్స్ నుండి కూడా ఎటువంటి స్పష్టత లేదా అప్డేట్ రాలేదు. ఇప్పటికే కన్నడ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న “గని” ఎందుకు వెనక్కి తగ్గాడు అన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. మరి “గని” కన్నడ వెర్షన్ ను ఎప్పుడు విడుదల చేస్తారు ? ఇప్పుడు వాయిదా వేయడానికి గల కారణమేంటి ? అనే విషయాలపై మేకర్సే క్లారిటీ ఇవ్వాలి.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?