యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ఫణికృష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ను శుక్రవారం ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ‘టైటిల్ కి తగిన విధంగా ఈ చిత్రంలో ఆది విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడ’ని చెప్పారు. టైటిల్ పోస్టర్ కూల్ అండ్ క్లాస్ గా ఆకట్టుకుంది. కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్. ఆర్. ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
We are very much Happy to share our movie name with you all.
⭐ing @AadiSaikumar @DiganganaS @mirnaaofficial
🎞️@SriSathyaSaiArt
🎬@siriki_phani
🎹#RRDhruvan
🎥#SatishMutyala
✂️@GiduturiSatya
💰@KKRadhamohan
🎧@adityamusic
📰@UrsVamsiShekar pic.twitter.com/HLsXGdMuQm— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) April 8, 2022