Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. 2026 సంవత్సరానికి గానూ ‘టైమ్ 100’ (TIME’s 100 most influential list) అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆయన స్థానం సంపాదించుకున్నారు. కాగా ఈ టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ఈ 100 మంది జాబితాలో రణ్‌బీర్‌తో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఉన్నారు. ఈ ఏడాది ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయ నటుడు రణ్‌బీర్ కావడం గమనార్హం. రణ్‌బీర్ కపూర్ గురించి మరో వెర్సటైల్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ‘టైమ్’ మ్యాగజైన్ కోసం ప్రత్యేక ప్రొఫైల్ రాశారు.
Also Read: Rukmini Vasanth: రుక్మిణి వసంత్ క్రేజీ లైనప్..మరో స్టార్ హీరోతో ‘బంపర్ ఆఫర్’!
Also Read
- 144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
‘సాధారణంగా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వసూళ్లనే విజయానికి కొలమానంగా చూస్తారు. కానీ రణ్‌బీర్ వాటన్నింటికీ అతీతంగా తన నటనపైనే దృష్టి సారిస్తాడు. తన అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలడు అని ఆయుష్మాన్ కొనియాడారు. గతేడాది ‘యానిమల్’ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన రణ్‌బీర్, ప్రస్తుతం నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో ఆయన రాముడిగా కనిపించనున్నారు. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘లవ్ అండ్ వార్’ అనే క్రేజీ ప్రాజెక్టును కూడా రణ్‌బీర్ లైన్‌లో పెట్టారు.
తాజావార్తలు
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!