గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు కార్తికేయ. పాత్ర నచ్చాలే కానీ ప్రతి నాయకుడి పాత్రకైనా సై అనే కార్తికేయ ఆ మధ్య నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ, ఇటీవల అజిత్ ‘వలిమై’లోనూ విలన్ పాత్రలే పోషించాడు. కానీ ఆ సినిమాలు కూడా అతనికి నిరుత్సాహాన్ని కలిగించాయి. తాజాగా కార్తికేయ హీరోగా ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also : Hari Hara Veeramallu: తోట తరణికి పవన్ కళ్యాణ్ హార్ధిక స్వాగతం!
హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి తొలిసారి అధికారికంగా ఓ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుపుతున్నట్టు తెలిపింది. ఇందులో తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితాస్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు సత్య జి ఎడిటర్. ఆర్. డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనుంది చిత్రయూనిట్.