Nicholas Pooran: దాచడానికి ఏముంది, మేం చెత్తగా ఆడాం.. లక్నో కెప్టెన్ పూరన్!
- ఐపీఎల్ 2026లో తడబడుతున్న ఎల్ఎస్‌జీ
- ఐదు మ్యాచ్‌లలో రెండే విజయాలు
- బ్యాటింగ్ వైఫల్యమే ఎల్ఎస్‌జీకి పెద్ద సమస్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో రెండే విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో బ్యాటింగ్ విభాగంలో విఫలమవడం ఎల్ఎస్‌జీకి పెద్ద సమస్యగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మ్యాచ్ అనంతరం లక్నో తాత్కాలిక కెప్టెన్ నికోలస్ పూరన్ ఈ విషయాన్ని నిజాయితీగా అంగీకరించాడు. ఈ సీజన్ మొత్తం తమ బ్యాటింగ్ ప్రదర్శన అంచనాలకు తగ్గట్లుగా లేదని, చాలా చెత్తగా ఆడాం అని చెప్పాడు. దాచడానికి ఏముంది, బ్యాటింగ్ కారణంగానే పరాజయాలు ఎదురవుతున్నాయని పూరన్ స్పష్టం చేశాడు.
‘ఈ సీజన్ మాకు చాలా కష్టంగా సాగుతోంది. బ్యాటింగ్‌లో మేము అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోయాం. ఆర్‌సీబీ మ్యాచ్‌లో 175 పరుగులు చేసినా పోటీ ఇచ్చేవాళ్ళం. కానీ మేం 20-30 రన్స్ తక్కువగా చేశాం. ఈ సీజన్ మొత్తం బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేది నిజం. ఈరోజు కూడా బ్యాటింగ్ తప్పిదంతోనే మూల్యం చెల్లించాం. టీ20 క్రికెట్ అనేది చాలా కఠినమైన ఫార్మాట్. ఇందులో నిలకడగా రాణించడం అంత సులభం కాదు. అయినప్పటికీ మా ఆటగాళ్లు కష్టపడుతున్నారు. వారికి క్రెడిట్ ఇవ్వాలి. మేము పోరాడుతూనే ఉంటాం. ఓపికగా ఉండాలి, అవకాశాలు వచ్చినప్పుడు సిద్ధంగా ఉండాలి, బాధ్యత తీసుకుని రాణించాలి’ అని నికోలస్ పూరన్ చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
‘నా బ్యాటింగ్ బాగానే ఉంది. బంతిని బాగా టైమింగ్ చేస్తున్నాను. కానీ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నా నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. ఫామ్ కోల్పవడం నాకు కొత్త కాదు. ఇలాంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొన్నాను. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎలా బయటపడాలో నాకు తెలుసు. త్వరలోనే నేను తిరిగి ఫామ్‌లోకి వస్తాను’ అని పూరన్ ధీమా వ్యక్తం చేశాడు. ఎల్ఎస్‌జీ బ్యాటింగ్‌లో ఇప్పటికైనా మెరగవకపోతే ఈ సీజన్‌లో తిరిగి పుంజుకోవడం కష్టమే. ఇకపై మ్యాచ్‌ల్లో జట్టు సమిష్టిగా రాణించాల్సిన అవసరం స్పష్టంగా ఉంది.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
-
BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
-
Bank Strike 2026: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!