పోర్న్ స్టార్ గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సన్నీ లియోన్ కొన్నేళ్ళుగా వెండితెరపై దృష్టి పెట్టింది. హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ నటిస్తోంది. తెలుగు సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’తో పాటు రాజశేఖర్ ‘గరుడవేగ’లోనూ నటించింది. తాజా మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ మూవీలో రేణుక అనే లీడ్ క్యారెక్టర్ చేస్తోంది సన్నీ లియోన్.
Read Also : HBD Allu Arjun : రూల్ చేయడానికి ‘పుష్ప’ రెడీ… కానీ ప్లాన్ చేంజ్
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్న విష్ణు, సన్నీ సరదాగా ఓ రీల్ చేశారు. ఈ రీల్ ని ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది సన్నీలియోన్. దూరం నుంచి ఏదో ఆలోచిస్తూ వస్తున్న విష్ణును ఓ మాస్క్ ముఖానికి పెట్టుకుని భయపెట్టడానికి ట్రై చేసింది సన్నీలియోన్. అయితే ఆ మాస్క్ ను చూసి భయపడని విష్ణు, దానిని తీసేసిన తర్వాత సన్నీ లియోన్ ముఖాన్ని చూసి భయపడినట్టు నటించాడు. దాంతో తనను ఆటపట్టించిన విష్ణు వెనుక పడింది సన్నిలియోన్. ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో ”చూపే బంగారమాయేనే శ్రీవల్లి..” పాటను పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ”అండ్ ఎగైన్ ఎపిక్ ఫెయిల్ ఫర్ మీ” అని కామెంట్ పెట్టింది సన్నిలియోన్. ఈ రీల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో ‘గాలి నాగేశ్వరరావు’ మూవీ తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నందు డైలాగ్స్ రాస్తున్నారు. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మూల కథను జి. నాగేశ్వరరెడ్డి సమకూర్చారు.