ప్రస్తుత తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ అధినేత, గ్లోబల్ సినిమాస్ ఛైర్మన్, నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్ నారాయణదాస్ నారంగ్ ఏప్రియల్ 19 (మంగళవారం) ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నారాయణ దాస్ కె నారంగ్ ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 78 సంవత్సరాలు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ‘లవ్ స్టొరీ, లక్ష్య’ వంటి […]
(ఏప్రిల్ 19న ‘అంతా మన మంచికే’కు 50 ఏళ్ళు) మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ 1953లోనే ‘చండీరాణి’తో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ తరువాత దాదాపు 19 ఏళ్ళ వరకు ఆమె దర్శకత్వం ఊసు ఎత్తలేదు. 1972లో స్వీయ దర్శకత్వంలో తమ భరణీ పిక్చర్స్ పతాకంపై ‘అంతా మన మంచికే’ అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు భానుమతి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం భానుమతి నిర్వహించారు. ఈ సినిమాలో కృష్ణ […]
KGF 2 కలెక్షన్ల పరంగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ చెప్పినట్టుగా రికార్డులన్నింటినీ తొక్కుకుంటూ పోతున్నాడు రాఖీ భాయ్. ఆయన వయోలెన్స్ కు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. ఇక ‘కేజీఎఫ్-2’ హిందీలో కొత్త చరిత్ర సృష్టించింది. ‘కేజీఎఫ్-2’ హిందీ వెర్షన్ ఈరోజు అంటే విడుదలైన 5వ రోజు 200 కోట్లు కొల్లగొట్టింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డును ‘కేజీఎఫ్-2’ బ్రేక్ చేసింది. ఈ రికార్డును క్రియేట్ చేయడానికి ‘బాహుబలి 2’ మూవీకి 6 రోజులు […]
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “ఎఫ్3”. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. మే 27న “ఎఫ్3” ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 22న […]
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు రాజ్యసభ సీటు అనే విషయంపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ వాడివేడి చర్చ నడుస్తోంది. మరోవైపు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేయనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు. ఈ కోటా కిందే ఆరేళ్ళ క్రితం […]
నేచురల్ స్టార్ నాని చేస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని మరో రెండు భాషల్లో విడుదల చేయడానికి […]
తెలుగు నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి వరుసగా బయోపిక్ లపై దృష్టి సారించారు. ఎన్టీఆర్ బయోపిక్ తో మొదలైన ఆయన జీవిత కథల నిర్మాణం… ‘తలైవి’ పేరుతో జయలలిత బయోపిక్, 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు విజయగాథ ఆధారంగా ’83’ అనే మూవీలతో కొనసాగింది. అయితే తాజాగా విష్ణు వర్ధన్ ఇందూరి మరో బయోపిక్ ను ప్రకటించారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ రాసిన “మావెరిక్ కమీషనర్ : ది ఐపిఎల్-లలిత్ మోడీ […]
Sarkaru Vaari Paata మూవీపై క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల కోసం “సర్కారు వారి పాట” టీం ఈ అప్డేట్ ను పంచుకున్నారు. అతి త్వరలోనే టీం ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయిందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం […]
సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ బ్యాక్ టు షూట్ అంటోంది. అస్సాంలో తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కొంత క్వాలిటీ టైంను ఆస్వాదించిన తర్వాత శృతి తిరిగి పనిలో పడింది. ఆమె తన తాజా ప్రాజెక్ట్ “మెగా154” షూటింగ్ ను స్టార్ట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది శృతి హాసన్. షూటింగ్ సెట్స్ లో జాయిన్ అయిన విషయాన్ని శృతి ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. మాస్ ఎంటర్‌టైనర్‌గా […]