Sarkaru Vaari Paata మూవీపై క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల కోసం “సర్కారు వారి పాట” టీం ఈ అప్డేట్ ను పంచుకున్నారు. అతి త్వరలోనే టీం ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయిందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపై రెగ్యులర్ అప్డేట్ షేర్ చేస్తామని కూడా చెప్పారు. చెప్పినట్టుగానే తాజాగా “సర్కారు వారి పాట”లో మిగిలిపోయిన సాంగ్ షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యిందని ప్రకటించారు. మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఏమిటంటే… సాంగ్ షూట్ కి సంబంధించిన పిక్స్ ను కూడా షేర్ చేయబోతున్నారట “సర్కారు వారి పాట” టీం. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాలోని 5వ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యింది.
Read Also : Mega 154 : శృతి హాసన్ బ్యాక్ టు షూట్
పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ “కళావతి”, “పెన్నీ”కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం థర్డ్ సాంగ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
And we begin the final song shoot of #SarkaruVaariPaata and it's going to be 💥💪🏼🔥
Will drop BTS pics from the shoot 😎
— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2022