బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. “కేజీఎఫ్-2″లో క్రూరమైన విలన్ అధీరాగా కన్పించి మెప్పించారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలిగిన సంజూ భాయ్ పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందులో ఆయన డ్రగ్స్ కు బానిసవ్వడం కూడా ఒకటి. అయితే తాజాగా “కేజీఎఫ్-2” హిట్ ను ఎంజాయ్ చేస్తున్న సంజూ భాయ్ తనకు అసలు డ్రగ్స్ అలవాటు ఎలా అయ్యింది ? అనే విషయాన్ని […]
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ […]
ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” గురించే టాక్. రికార్డ్స్ తో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో కొల్లగొడుతున్నాడు రాఖీ భాయ్. ఈ సినిమాలో యష్ యాక్టింగ్, ప్రశాంత్ నీల్ టేకింగ్, అద్భుతమైన విజువల్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకులు, విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి “కేజీఎఫ్-2” […]
(ఏప్రిల్ 17న హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు) కొన్ని ముఖాలు చూడగానే, పాపం పిల్లాడు అనిపిస్తాయి. అలా వయసుతో నిమిత్తం లేకుండా చాలా రోజులు పిల్లాడిలాగే కనిపించి మాయ చేశారు నవతరం కథానాయకుడు సిద్ధార్థ్. చదువు పూర్తి కాగానే సినిమాలపై ఆసక్తితో పరుగు తీసిన సిద్ధార్థ్ కు యాడ్ ఫిలిమ్ మేకర్ జయేంద్ర, సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ద్వారా మణిరత్నం వంటి దిగ్దర్శకుని వద్ద అసోసియేట్ గా పనిచేసే అవకాశం లభించింది. మణిరత్నం తెరకెక్కించిన ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’కు అలా అసోసియేట్ […]
(ఏప్రిల్ 17న ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు) చెప్పాలనుకున్న కథను సూటిగా చెప్పాలని ప్రయత్నిస్తారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆయన దర్శకత్వంలోనూ పొరపాట్లు కనిపించవచ్చు కానీ, తడబాటుకు తావు ఉండదు. నిదానం ప్రధానం అనుకుంటూ తన దరికి చేరిన చిత్రాలకు న్యాయం చేయాలని తపిస్తూ ఉంటారు మోహనకృష్ణ. ఇంద్రగంటి మోహనకృష్ణ 1972 ఏప్రిల్ 17న తణుకులో జన్మించారు. ఆయన తండ్రి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, తల్లి జానకీబాల ఇద్దరూ ప్రముఖ రచయితలు. శ్రీకాంతశర్మ ‘ఆంధ్రప్రభ’ సచిత్రవారప్రతికకు ఎడిటర్ గానూ పనిచేశారు. […]
కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అంతర్జాతీయ వేదికపై స్విమ్మింగ్ లో మరోసారి సత్తా చాటాడు. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ స్విమ్మింగ్ మీట్‌లో వేదాంత్ రజత పతకాన్ని గెలుచుకోవడంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన మెన్స్ 1500 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ పోటీల్లో 16 ఏళ్ల వేదాంత్ 15.57.86 సెకన్ల సమయంలో టార్గెట్ ను పూర్తి చేసి, రెండో స్థానంలో నిలిచాడు. ఈ విషయాన్ని మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా […]
“బీస్ట్” బ్యూటీ పూజా హెగ్డే శారీలో తన కిల్లర్ లుక్స్ తో చంపేస్తోంది. లైట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీలో పూజాహెగ్డే మెరిసిపోతున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బుట్టబొమ్మకు సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా దూసుకెళ్తున్న పూజాహెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉంది. “ఎఫ్3″లో […]
తలపతి విజయ్ నటించిన “బీస్ట్” ఏప్రిల్ 13న వెండితెరపైకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. “బీస్ట్” వర్సెస్ “కేజీఎఫ్-2” అన్నట్టుగా ఒకే ఒక్క రోజు గ్యాప్ తో […]
మాస్ మహారాజ రవితేజ మొదటి పాన్-ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఆమెతో పాటు బాలీవుడ్ దివా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా మరో కథానాయికగా నటిస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే […]
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు డిస్నీ+ హాట్‌స్టార్‌లో మంచి ఆదరణ దక్కుతోంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఉండేలా షో ఆసక్తికరమైన కంటెంట్‌ని అందిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారంలోకి అడుగుపెట్టింది. 17 మందితో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం 11 మంది మాత్రమే హౌజ్ లో గేమ్ ఆడుతున్నారు. అందులో ముందు నుంచీ పడని ఇద్దరు […]