Yugal movie: ప్రమోద్ కుమార్ దర్శకత్వంలో ఆర్. బాలాజీ నిర్మిస్తున్న సినిమా ‘యుగల్’. దీనికి దర్శకుడు ప్రమోద్ కథ, చిత్రానువాదం సమకూర్చుతున్నారు. ‘ది మ్యాన్ విత్ డైవర్షన్’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో జి.ఎస్.ఎన్. నాయుడు ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో జిఎస్ఎన్ నాయుడు మాట్లాడుతూ, ”గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మొదట ఈ చిత్రానికి ‘గన్ని’ అనే టైటిల్ ను అనుకున్నాం, కానీ ఆ టైటిల్ వేరే వాళ్ళు దగ్గర ఉంది. దాంతో ‘యుగల్’ పేరును ఖరారు చేశాం. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తాను” అని తెలిపారు. ప్రొడ్యూసర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ “దర్శకుడు ప్రమోద్ కుమార్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి, మా బ్యానర్ లో ‘మహాభారతం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ‘యుగల్’ సినిమాను త్వరలో ఇంకో కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాం” అని అన్నారు. దర్శకుడు ప్రమోద్ దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయని, అవి నచ్చడంతో వరుసగా సినిమాలు నిర్మించే పనిలో పడ్డామని రాహుల్ తెలిపారు. దర్శకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ”మా హీరో జీఎస్ఎన్ నాయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అందుకే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదల చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.