O Saathiya: చిత్రసీమలో లేడీ టెక్నీషియన్స్ ఉండటం చాలా అరుదు. అలాంటిది ‘ఓ సాథియా’ సినిమాకు దర్శకురాలు, నిర్మాత మహిళలు కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ‘ఓ సాథియా’ అనే చిత్రాన్ని నిర్మిస్తుండగా, దివ్యా భావన దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘జీ జాంబీ’ ఫేమ్ ఆర్యన్ గౌర హీరోగా, మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవల ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. యూ ట్యూబ్ లోనూ అప్ లోడ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు చక్కని స్పందన లభించింది. తాజాగా చిత్ర బృందం సంక్రాంతి పండగను పురస్కరించుకుని సెకండ్ పోస్టర్ నూ జనం ముందుకు తీసుకొచ్చింది. ఈ చిత్రానికి విన్ను సంగీతాన్ని సమకూర్చగా, ఈజే వేణు సినిమాటోగ్రఫీ అందించారు. ‘వీరిద్దరి పనితనం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని, ప్యూర్ లవ్ స్టోరీగా ‘ఓ సాథియా’ను తెరకెక్కించామ’ని దర్శకురాలు దివ్యా భావన చెప్పారు. అతి త్వరలోనే ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత కట్టా చందన తెలిపారు.