Rahul Ramakrishna: ‘పెళ్ళిచూపులు’ సినిమాతో హాస్యనటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ అక్కడ నుండి వెనుదిరిగి చూడకుండా దూసుకు పోతున్నాడు. పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించడంతో పాటు ‘ఇంటింటి రామాయణం’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించాడు. ఈ సినిమా త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇదిలా ఉంటే… రాహుల్ రామకృష్ణ తన భార్య హరిత ప్రెగ్నెంట్ అనే విషయం కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తాజాగా ‘బోయ్, సంక్రాంతి రిలీజ్,’ అనే కాప్షన్ తో ఓ పండంటి బిడ్డ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. వ్యక్తిగత విషయాలను అత్యంత గోప్యంగా ఉంచే రాహుల్ రామకృష్ణ ఎప్పుడో కానీ ఇలాంటి విశేషాలను నెటిజన్స్ తో పంచుకోడు. పైగా తరచూ ఏవో కొంటి చేష్టలతో సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ గురవుతుంటాడు. ఈ నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ ఇంట్లోకి సంక్రాంతి పండగ రోజునే మగబిడ్డ అడుగుపెట్టడం డబుల్ థమాకా అనే అనుకోవాలి. అతని అభిమానులతో పాటు చిత్రసీమలోని స్నేహితులు కూడా రాహుల్ రామకృష్ణను అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Boy.
Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1— Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023