తెలుగులో 'విరూపాక్ష' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ప్రముఖ పంపిణీ సంస్థలు ఈ సినిమా విడుదలకు ముందుకొచ్చాయి.
నరేశ్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు ప్రధాన పాత్రలు పోషించిన వినోదప్రధాన చిత్రం 'హ్యాష్ ట్యాగ్ మెన్ టూ' మే 26న విడుదల కాబోతోంది. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మౌర్య సిద్ధవరం నిర్మించారు.
'ది కశ్మీర్ ఫైల్స్' పంథాలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' మూవీ సైతం వివాదలలో చిక్కుకుంటోంది. ఉగ్రవాద సంస్థ 'ఐఎస్ఐఎస్' చీకటి కోణాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5న నాలుగు భాషల్లో విడుదల కావాల్సి ఉండగా, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని కాంగ్రెస్ తో సహా కొన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి.
తెలుగు పాన్ ఇండియా చిత్రాల నిర్మాతల ఆలోచనలో ఇప్పుడు మార్పు వచ్చింది. అంబరాన్ని చుంబించాలనే ఆలోచనలను పక్కన పెట్టి, ముందు తెలుగులో తమ సినిమాను విడుదల చేసిన తర్వాతే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
మాస్ మహరాజా రవితేజ ట్రోలింగ్ కు గురౌతున్నారు. 'రావణాసుర' మూవీ పబ్లిసిటీలో భాగంగా 'నేను రావణాసురుడి ఫ్యాన్' అని ఆయన చెప్పిన మాటలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న రవితేజ నిర్మించిన 'ఛాంగురే బంగారు రాజా' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
బెక్కెం వేణు గోపాల్ ది నిర్మాతగా 16 సంవత్సరాల ప్రస్థానం. 'టాటా బిర్లా మధ్యలో లైలా'తో మొదలైన సినీ ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. దానికి కారణం తనలోని అంకితభావమే అంటున్నారాయన.
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన 'హీట్' సినిమా టైటిల్ అండ్ హీరో ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ఆవిష్కరించారు. ఈ మూవీని ఎం.ఎన్. అర్జున్, శరత్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు.
అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో అనిల్ సుంకర నిర్మించిన 'ఏజెంట్' మూవీ శుక్రవారం జనం ముందుకు వస్తోంది. ఈ సినిమా ఆడియెన్స్ కు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను కలిగిస్తుందని అనిల్ చెబుతున్నారు.
సాయిధరమ్ తేజ్ తాజా చిత్రం 'విరూపాక్ష' తొలి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 55 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో మే 5న రాబోతున్న 'రామబాణం' ట్రైలర్ ను ప్రదర్శిస్తున్నారు. బుధవారం సెన్సార్ పూర్తి చేసుకున్న 'రామబాణం'కు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.
సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. బన్నీ వాసు, వెంకటేశ్ మహ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.