Heat: సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఆ జానర్‌కు సపరేట్ ఆడియెన్స్ ఉంటారు. అయితే ఈ మధ్య మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ తెరపైకి వచ్చేస్తోంది. అదే ‘హీట్’. ‘ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్’ అనేది దీని ట్యాగ్ లైన్. వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన ‘హీట్’ సినిమాను ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం. ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం. ఎన్. అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ‘హీట్’ మూవీ టైటిల్ పోస్టర్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు, ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ టైటిల్ పోస్టర్‌తోనే మూవీ థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనేది ఈ పోస్టర్ బట్టి అర్థమౌతోంది. అయితే… పోస్టర్ ను ఆసక్తికరంగా రూపొందించి… చిత్ర యూనిట్ తొలి సక్సెస్ అందుకుందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల సహ నిర్మాతలుగా వ్యవహరించారు.