ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. […]
కరోనా కాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,590 వద్ద ఉన్నది. కరోనా పాజిటివ్ కేసులు […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్ […]
ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌక్టే తుఫాన్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తుఫాను ధాటికి పశ్చిమ తీర ప్రాంతం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. టౌక్టె తుఫాను బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో ముప్పు దూసుకు రాబోతున్నది. ఈసారి తూర్పు తీరంలో ఆ ముప్పు ఉండబోతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. తూర్పు తీరంలోని అండమాన్ కు ఉత్తరాన సముద్రంలో ఈనెల 22 వ తేదీన అల్పపీడనం ఏర్పడే […]
సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో సౌకర్యాల గురించి, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రుల్లోని కొన్ని వార్డులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కరోనా రోగులకు ఆయన ధైర్యం చెప్పారు. కరోనా నుంచి తప్పక కోలుకుంటారని వారికి భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ లు ఉన్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్న వైద్యులను, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ […]
ఎప్పుడో 70 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆచూకీని కనిపెట్టేందుకు ఆ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం 70 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆ మనిషిని ఖననం చేశారో ఆ సమాధిని తవ్వి ఎముకలకు సేకరించారు. డీఎన్ఏ ద్వారా ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది… తెలుసుకుందాం. 70 ఏళ్ల క్రితం అంటే 1948 డిసెంబర్ 1 వ తేదీన అడిలైడ్ సమీపంలోని సోర్ధమాన్ బీచ్ లో ఓ మృతదేహం కనిపించింది. అతని గురించి […]
టౌటే తుఫాన్ ఈనెల 18 వ తేదీన గుజరాత్ తీరాన్ని దాటింది. తరాన్ని దాటే సమయంలో భారీ విధ్వంసం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అహ్మదాబాద్ నగరంపై టౌటే తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ తుఫాన్ ధాటికి నగరం అల్లకల్లోలం అయింది. బలమైన గాలులతో కూడిన వర్షం కురవడంతో అహ్మదాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. […]
సీఎం కేసీఆర్ తొలిసారిగా హైదరాబాద్ లోకి గాంధీ ఆసుపత్రిని సందర్శించబోతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత అయన మొదటిసారిగా గాంధీ ఆసుపత్రికి వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ను తప్పించిన తరువాత ఆ శాఖలను ముఖ్యమంత్రి కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటంతో కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన తరువాత ఎలాంటి […]