నేడు ఏపీ అసెంబ్లీ సమావేశం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈరోజు జరగబోతున్నాయి. ఒక్కరోజు మాత్రమే ఈ సమావేశం ఉంటుంది. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వర్చువల్ విధానంలో మాట్లాడబోతున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం, వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ సమావేశాలకు ముందుగా ఏపీ కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు. ఇక ఈ బడ్జెట్ సమావేశం అనంతరం మండలి చైర్మన్ కు శాసన మండలి సభ్యులు వీడ్కోలు పలకనున్నారు. ఈనెలాఖరులో మండలి చైర్మన్ పదవీకాలం ముగియనున్నది. అయితే, అసెంబ్లీ సమావేశాలను ఒక్కరోజుకే పరిమితం చేయడాన్ని తప్పుడు పడుతూ సమావేశాలను టీడీపీ బాయ్ కాట్ చేసింది. రూ.2.25 నుంచి 2.30లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో హోమ్ శాఖామంత్రి సుచరిత వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Also Read
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
OTR: పశ్చిమ గోదావరి వైసపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..