ఉత్తర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. నగరాలు, పట్టణాల నుంచి ఇప్పుడు గ్రామాలకు వ్యాపించింది. గ్రామాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు.గ్రామాల్లో వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండటంతో వేలాది మందికి కరోనా సోకుతున్నది. ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పత్ జిల్లాలోని లంబా గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తున్నది. లంబా గ్రామంలో 27 రోజుల వ్యవధిలో 36 మంది మృతి చెందారు. దీంతో […]
ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో దేశంలో ఆంక్షలు కఠినంగా అమలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు భారత ప్రయాణికులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులో ఇప్పుడు సూడాన్ చేరిపోయింది. భారత ప్రయాణికులపై రెండు వారాలపాటు ఆంక్షలు విధించింది. భారత దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో సుడాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ తో పాటుగా ఈజిప్టు, ఇథియోపియా దేశాల ప్రయాణికులపై కూడా సుడాన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
హైదరాబాద్ ఫార్మా హబ్ గా మారిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ లు కరోనా టీకా కేంద్రాలుగా మారాయి. ఇప్పుడు బయోలాజికల్ ఈ సంస్థ సొంతంగా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ దశలో ఉన్నది. ఇకపోతే, ఈ వ్యాక్సిన్ తో పాటుగా అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ ను కూడా బయోలాజికల్ ఈ సంస్థ ఉత్పత్తి చేసేందుకు […]
మధ్యదరా సముద్రంలో మరో ఘోరం జరిగింది. లిబియా నుంచి ఇటలీ వెళ్తున్న వలస దారుల పడవ ట్యునీషియా వద్ద మునిగింది. ఈ ఘటనలో 57 మంది మృతి చెందారు. 33 మందిని అధికారులు రక్షించారు. ట్యునీషియాలో వాతావరణం కొంత కుదురుకున్నాక మళ్ళీ వలసలు ప్రారంభం అయ్యాయి. పరిమితికి మించి పడవలో వలసదారులు ప్రయాణించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా ఖండం మీదుగా ఐరోపా ఖండానికి వలసలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులు బంగ్లాదేశీయులని అధికారులు […]
ఉత్తర ప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కరోనా సోకుతున్నది. తాజాగా కరోనాతో యూపీ మంత్రి విజయ్ కశ్యప్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ముజఫర్ జిల్లాలోని చార్తవాల్ […]
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. కరోనాను కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్ అమలు చేస్తున్నా కట్టడి కావడం లేదు. నగరాలు, పట్టణాలతో పాటుగా ఈ వైరస్ ఇప్పుడు గ్రామాలను సైతం చుట్టేస్తోంది. దీంతో గ్రామాలు కరోనా బారిన పడుతున్నాయి. గ్రామాల్లో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గ్రామాల్లో కరోనా వ్యాపించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యూపీ ప్రజలను ఆ దేవుడే […]
నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది. కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే. పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు […]
భూకంపం వచ్చినపుడు భవనాలు ఊగిపోతుంటాయి. నేలమట్టం అవుతుంటాయి. ఆకాశాన్ని తాకే భవనాల్లో ఉండే ప్రజలు భూకంపం వచ్చినపుడు బయటకు పరుగులు తీస్తుంటారు. భూకంపం నుంచి తట్టుకునే విధంగానే పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తుంటారు. అయితే, చైనాలోని షెన్ జెన్ నగరంలో ఉన్న 72 అంతస్తుల సెగ్ ప్లాజా భవనం ఉన్నట్టుండి ఊగిపోయింది. భూకంపం వచ్చిన సమయంలో ఎలాగైతే భవనాలు ఊగిపోతాయో అలా ఊగిపోయింది. దీంతో ఆ భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను హుటాహుటిన బయటకు పంపించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవనం ఊగిపోవడంతో మొత్తం ఉద్యోగులను […]
మేషం : వృత్తుల వారికి అవకాశాలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వృషభం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీలో రూపుదిద్దుకున్న ఆలోచనలు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలలో పెద్దల సలహాను తీసుకోవడం చాలా […]
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులతో పాటుగా ధరలు కూడా పెరుగుతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.45,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.330 పెరిగి రూ. 49,590కి చేరింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే […]