నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆయుర్వేద మందకు ప్రజలు పోటెత్తారు. ఒక్కసారిగా జనం పోటెత్తడంతో తోపులాట జరిగింది. తోపులాట జరగడంతో ఆయుర్వేద మందును నిలిపేశారు. మందు కోసం కనీసం 50వేల మంది వరకు వస్తారని అంచనా వేశారు. అయితే, పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. కరోనా సోకిన రోగులు అంబులెన్స్ లో అక్కడికి వస్తుండటంతో మాములు ప్రజలు ఆందోళన చేశారు. జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మందు పంపిణీవద్ద సోషల్ డిస్టెన్స్ కనిపించలేదు. ఇక […]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీఐడీ కోర్టు నిరాకరించింది. అయితే తనను పోలీసులు కొట్టారని, ప్రైవేట్ ఆసులపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతించాలని, బెయిల్ మంజూరు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో కేసు ధాఖలు చేశారు. పిటీషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని, ఆ నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని, వైద్యపరీక్షలను వీడియో తీయాలని ఆదేశించింది. […]
రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కరోనా, లాక్ డౌన్ ప్రభావం మెట్రో పై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లునడుస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో ఉండగా చివరి మెట్రో రైలు 8.45 గంటల అందుబాటులో ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది. మే 12 […]
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. గతంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొన్నది. హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో […]
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలి. కరోనా రోగి తుమ్మినప్పుడు అతని తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రసరిస్తాయి. అదే విధంగా మైక్రో తుంపర్లు […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఏ వ్యక్తికి ఎప్పుడు కరోనా సోకుతుందో తెలియని పరిస్థితి. కరోనా మహమ్మారి బారినుంచి కోలుకుంటాడో లేదో చెప్పలేని పరిస్థితి. పెళ్ళైనా వారు, పెళ్లి కానివారు, పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్దమైన వారు ఇలా ఎవర్ని కరోనా మహమ్మారి వదలడం లేదు. మరో మూడు రోజుల్లో పెళ్లి ఉందని అనగా, పెళ్లి కుమారుడు కరోనాతో బలయ్యాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులో జరిగింది. సాలూరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి […]
మేషం : ఈ రోజు మేష రాశి వారికి వ్యాపారం, కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ తెలివితేటలు, అవగాహనతో చాలా క్లిష్టమైన విషయాలను పరిష్కరించుకుంటారు. ఎందుంకటే మీ అంచనాలకు అనుగుంగా ఉండరు. ఇల్లు, కార్యాలయంలో అన్ని సమస్యలను సహనంతో, సంయమనంతో విజయవంతంగా పరిష్కరించుకుంటారు. కార్యాలయంలో ఈ రోజు మీరు కొంత బీజీగా ఉంటారు. వీలైనంత వరకు అనవసర విషయాల్లో తలదూర్చకండి. వృషభం : వృషభ రాశి వారు పనిప్రదేశంలో మీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా […]
కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు మరణిస్తున్నారు. ఒడిశాకు చెందిన ప్రముఖ శిల్పి, పద్మవిభూషణ్ గ్రహీత, రాజ్యసభ సభ్యుడు మహాపాత్ర మే 9 వ తేదీన కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన ఇద్దరు కుమారులకు కూడా కరోనా సోకింది. ఇద్దరు ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం రోజున చిన్న కుమారుడు ప్రశాంత కన్నుమూయగా, పెద్ద కుమారుడు జషోబంత ఈరోజు ఉదయం కన్నుమూశారు. పదిరోజుల వ్యవధిలో ఎంపీ మహాపాత్ర, ఆయన ఇద్దరు కుమారులు […]
గత 11 రోజులుగా ఇజ్రాయిల్… గాజాల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గాజాలోని హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య భీకరమైన పోరు జరిగింది. జేరూసలెంపై హమాస్ తీవ్రవాదులు కొన్ని వందల రాకెట్లతో దాడులు చేయగా, ఇటు ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో దాదాపుగా 200 మంది వరకు పాలస్తీనా పౌరులు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు కాగా, లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడులు ఆపాలని, కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి రావడం […]