ప్రపంచంలో అత్యంత ఎత్తైన గ్రామం ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉందని చెప్తారు. హిమాచల్ ప్రదేశ్ లోని కోమిక్ గ్రామం అత్యంత ఎత్తైన గ్రామంగా చెప్తారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. కొన్ని చోట్ల ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటే, మరికొన్ని చోట్ల మొదటి డోస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. […]
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితం కావడంతో జననాల రేటు పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో సంతానోత్పత్తిపై దృష్టి సారిస్తారని అనుకున్నారు. కరోనా మహమ్మారి ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపించాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. పోయిన ఉద్యోగాలపై దృష్టి సారించారు. దీంతో 2020లో జననాల రేటు తగ్గింది. 2019 లో అమెరికా మొత్తం మీద 37.5 లక్షల మంది […]
దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు రోజుకు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, చెన్నైలో ఈ కేసులు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయి. చెన్నై నగరంలో ప్రస్తుతం 50 వేల వరకు పాజిటివ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. దీంతో నగరంలోని కరోనా […]
ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు. అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. వెనక బడిన కులాలకు బడ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు. ఇక ఏ […]
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. కరోనాతో అనేక మంది రాజకీయ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో […]
స్వరరాగ గంగా ప్రవాహమే అని జేసుదాసు పాడితే పరవశించిపోయిన ఈ దేశంలో ఇప్పుడు శవగంగా ప్రవాహం చూశావా రాజా అని ప్రశ్నించే విషాదాన్ని సృష్టించిన వారెవరు? పరవశాన శిరసూగంగా తలకు జారెనా శివగంగ అని శంకరశాస్త్రి గానం చేసిన శివగంగను శవగంగగా మార్చిన వారెవరు? సెకండ్ వేవ్ అనే కరోనా మలిదెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతుంటే ప్రాణవాయువును అందించలేని ఘోర దురవస్థ రావడానికి కారకులెవరు?ప్రపంచానికే వాక్సిన్ అందించే ఔషద రాజధానిగా దేశాన్ని మార్చామని గొప్పు […]
టెస్ట్… ట్రేస్… ట్రీట్ కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఈ మూడు విధానాలను పాటిస్తున్నారు. అయితే, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించడం వలన చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్య కొంతమేర తక్కువగా ఉంటోంది. అంతేకాదు, చాలా ప్రాంతాల్లో కరోనా టెస్టులు ఎలా చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఇప్పుడు ఇండియాలో సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్టులు చేసుకోవడానికి వీలు ఉండేవిధంగా ఓ కిట్ ను రూపొందించారు. ఈ కిట్ కు ఐసిఎంఆర్ […]
ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.
దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది. అయితే, గత 9 రోజులుగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నది. ఇక ఇదిలా ఉంటె, కరోనాతో పాటుగా ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి ఇబ్బందులు పెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్ కనిపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణ సర్కార్ ఈ బ్లాక్ […]