ఈరోజు ప్రధాని మోడీ దేశంలోని 10 రాష్ట్రాల్లోని జిల్లాల అధికారులతో సమావేశం కాబోతున్నారు. 10 రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో జిల్లాల అధికారులతో సమావేశం కావాలని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పుదుచ్చేరి, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడబోతున్నారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ అధికారులతో చర్చించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తరువాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది.