ఎప్పుడో 70 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆచూకీని కనిపెట్టేందుకు ఆ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం 70 ఏళ్ల క్రితం ఎక్కడైతే ఆ మనిషిని ఖననం చేశారో ఆ సమాధిని తవ్వి ఎముకలకు సేకరించారు. డీఎన్ఏ ద్వారా ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది… తెలుసుకుందాం.
70 ఏళ్ల క్రితం అంటే 1948 డిసెంబర్ 1 వ తేదీన అడిలైడ్ సమీపంలోని సోర్ధమాన్ బీచ్ లో ఓ మృతదేహం కనిపించింది. అతని గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసి శవాన్ని ఖననం చేశారు. ఆ తరువాత మరణించిన వ్యక్తికి సంబంధించి ఓ సూట్ కేస్ పోలీసులకు దొరింది. అందులో ఉన్న ఉత్తరాలను బట్టి భగ్న ప్రేమికుడిగా పోలీసులు గుర్తించారు. ఆ సూట్ కేసులో ఓ ఫోన్ నెంబర్ ఉండటంతో ఆ నెంబర్ కు ఫోన్ చేశారు. జెస్సి అనే మహిళను ప్రశ్నించారు. కానీ, ఆ మహిళకు మరణించిన వ్యక్తి కి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. అయితే, ఆమెకు ఓ కుమారుడు ఉండటంతో అతని డీఎన్ఏ తో మరణించిన వ్యక్తి డీఎన్ఏ సరిపోతుందేమో అని పోల్చి చూసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు.