కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు యూఎస్ మూడు రకాల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. 35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో దాదాపుగా 25 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఇందులో 12 కోట్ల మందికి రెండు డోసులు అందించగా, 16 కోట్ల మందికి కనీసం మొదటి డోసును అందించారు. అయితే, ఏప్రిల్ 1 తర్వాత యూఎస్ లో వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య క్రమంగా […]
హైదరాబాద్ లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో, రోడ్లపైకి ఎవర్ని అనుమతించడం లేదు. రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు కఠినంగా హెచ్చరించారు. పోలీసులు రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడేకంటే ఇంట్లోనే ఉండటం మంచిది అని చెప్పి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి.
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు. ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది. ఈ మందుకు శాస్త్రీయత […]
మే 13 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈనెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో కేసులు తక్కువగా నమోదవుతున్నా, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధం అయ్యింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి సరుకు రవాణా వాహనాలకు […]
అరుణ గ్రహం పై అడుగిడిన రెండో దేశం చైనా. తియాన్ వెన్ 1 అనే వ్యోమనౌకను గతేడాది చైనా ప్రయోగించింది. ఈ నౌక ఇటీవలే అరుణగ్రహంలోని ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఉపగ్రహంలో ఉన్న ఝురాంగ్ రోవర్ శనివారం రోజున ల్యాండర్ నుంచి కిందకు దిగింది. మార్స్ మీద అడుగుపెట్టిన ఆరు చక్రాలతో కూడిన రోవర్ ఫోటోను భూమి మీదకు పంపించి. హైరెజల్యూషన్ 3డి కెమెరాల సహాయంతో ఫోటోలను తీసింది. ఈ రోవర్ గంటకు 200 మీటర్ల మేర ప్రయాణం చేస్తున్నది. […]
ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం […]
ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కంట్రోల్ చేయడానికి అనేక ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నా కట్టడి కావడం లేదు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అత్యవసర, అంబులెన్స్ ను మినహాయించి మిగతా వాటికీ ఈ పాస్ లు […]
కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది. ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సమయం అగ్గిపోయింది. గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఖచ్చితంగా నిర్ధారణ జరగాలి అంటే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలి. దీనికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది. దీంతో మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిర్ధారణ వచ్చే కిట్లను తయారు చేశారు. లాలాజలంతో […]
కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ కారణంగా మహారాష్ట్ర అతలాకుతలం అయ్యింది. రెండు దశల్లో ఆ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొన్నది. సెకండ్ వేవ్ సమయంలో ఆ రాష్ట్రం మరింతగా దెబ్బతిన్నది. ఏప్రిల్ 5 వ తేదీ నుంచి మహారాష్ట్రలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులపాటు నైట్ కర్ఫ్యూ, ఆ తరువాత ఉదయం కర్ఫ్యూ అమలు చేసిన సర్కార్, ఒక దశలో 144 సెక్షన్ కూడా అమలు చేసింది. కేసులు తగ్గకపోవడంతో లాక్ డౌన్ ను అమలు చేసింది. జూన్ […]