EO Theft In Temple: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలో గల ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో ఈవో మురళీకృష్ణ ఐదు కిలోల వెండి ఆభరణాలు, చీరలు సహా ఇతర విలువైన వస్తువులను చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులకు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. ఈ చోరీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆలయ ఈవో మురళీని సస్పెన్షన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఈవో మురళీకృష్ణ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలిపారు. ఇక, దేవాలయాల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే కఠిన చర్యలని తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also: TVK Party: టీవీకే పార్టీకి షాక్.. పుదుచ్చేరి సభలో కేవలం లోకల్స్కి మాత్రమే అనుమతి
అయితే, గంగమ్మ గుడిలో చోరీకి పాల్పడిన ఆలయ ఈవోపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మురళీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళరాదని పేర్కొన్నారు. హిందూపూర్ ఎండోమెంట్ కు కదిరి గ్రూప్ టెంపుల్స్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఎండోమెంట్ కమీషనర్ రామచంద్ర మోహన్ ఆదేశాలు ఇచ్చారు.