టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో […]
మేషం: మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. వృషభం: వృత్తిపరమైన ప్రయాణాలు సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాలు […]
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోలేదు. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి తీవ్రతరం కావడంతో రైతులు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లారు. అయితే, ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్లారు. […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 18,767 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,80,827కి చేరింది. ఇందులో 13,61,464 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,09,237 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 104 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,126కి చేరింది. అనంతపురంలో 1846, […]
గత ఏడాది నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కరోనా మహమ్మారికి కారణం చైనా అని, చైనా వైరస్, కుంగ్ ఫ్లూ వైరస్ అని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పుడు ఆయన మాజీ కావడంతో చైనీస్ అమెరికా సామాజిక హక్కుల సంఘం కోర్టులో కేసు ఫైల్ చేసింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యల కారణంగా ఆసియా ప్రజలపై దాడులు […]
మాస్క్ ధరించడం వలన కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించడం వలన వైరస్ లోనికి ప్రవేశించలేదని చెప్తున్నారు. అయితే, ఇప్పుడు అదే మాస్క్ వలన బ్లాక్, వైట్ ఫంగస్ వంటివి సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్ ను ఎక్కువ రోజులు వాడటం వలన, శుభ్రం చేసుకోకుండా మాస్క్ ను వినియోగించడం వలన అందులో మ్యూకోర్ మైకోసిస్ అనే ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని, ఈ […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని, మనుషుల జీవితాలను ఎలా మార్చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా మహమ్మారి బారిన పడి ఎలాగోలా కోలుకున్నా, బ్లాక్ ఫంగస్ వంటి రోగాలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తుల్లో చాలా మంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. బ్లాక్ ఫంగస్ కు అందించాల్సిన వైద్యం ఖరీదు కావడం, ఇంజెక్షన్లు తగినన్ని అందుబాటులో లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక బ్లాక్ ఫంగస్ తో పాటుగా వైట్ ఫంగస్ కూడా విజృంభిస్తోంది. అయితే, […]
ఆనందయ్య మందును ఆయుర్వేధంగా గుర్తించే అవకాశం ఉన్నట్టు ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆనందయ్య మందుపై తుది అధ్యయనం జరుగుతోందని, నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేధంగా గుర్తించవచ్చని రాములు పేర్కొన్నారు. ఆనందయ్య మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో వినియోగించేవే అని, ఆయుర్వేధంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో ఉందని, కానీ కేంద్రం సాయం తీసుకుంటామని రాములు పేర్కొన్నారు. అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది కాబట్టి ప్రస్తుతానికి ఆనందయ్య మెడిసిన్ ను ఆయుర్వేధంగా గుర్తించలేమని ఆయుష్ […]
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటి రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ను సడలిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు లాక్ డౌన్ అమలులో […]