రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కరోనా, లాక్ డౌన్ ప్రభావం మెట్రో పై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లునడుస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో ఉండగా చివరి మెట్రో రైలు 8.45 గంటల అందుబాటులో ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది. మే 12 తరువాత ఈ సంఖ్య దారుణంగా పడిపోయింది. రోజుకు 4 లక్షల మంది వరకూ మెట్రోలో ప్రయాణం చేసేవారు. కానీ, ఈ లాక్‌డౌన్ కాలంలో ఆ సంఖ్య కనిష్టంగా నాలుగు వేలకు పడిపోయింది. ఈ స్థాయిలో ప్రయాణికులు తగ్గిపోవడం ఇదే మొదటిసారి.