దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై కేంద్రం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలి. కరోనా రోగి తుమ్మినప్పుడు అతని తుంపర్లు ఆరు అడుగుల దూరం వరకు ప్రసరిస్తాయి. అదే విధంగా మైక్రో తుంపర్లు కనీసం 30 అడుగుల వరకు వ్యాపిస్తాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తలుపులు తెరిచే ఉంచాలని, ఫ్యాన్లు వేసుకోవాలని అప్పుడే ఇంటి లోపల ఉన్న కరోనా మహమ్మారి బయటకు వెళ్ళిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.