నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ను సీఐడీ కోర్టు నిరాకరించింది. అయితే తనను పోలీసులు కొట్టారని, ప్రైవేట్ ఆసులపత్రిలో వైద్య పరీక్షలకు అనుమతించాలని, బెయిల్ మంజూరు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో కేసు ధాఖలు చేశారు. పిటీషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని, ఆ నివేదికను సీల్డ్ కవర్‌లో అందించాలని, వైద్యపరీక్షలను వీడియో తీయాలని ఆదేశించింది. కాగా, సుప్రీం ఆదేశాల ప్రకారం, వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందించారు. కాగా, ఈరోజు రఘురామ బెయిల్ పిటీషక్ కు సంబందించి విచారణ ప్రారంభం అయింది. రఘురామ కృష్ణంరాజుకు బెయిల్ ఇవ్వ కూడదని ఏపీ సర్కార్ కోర్టులో కౌంటర్ ఫైల్ చేసింది. దేశద్రోహం కింద రఘురామను అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ సీఐడీ పేర్కోన్నది.